afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి

అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విందు వినోదాల్లో తేలిపోతుంటే..ప్రజలు మాత్రం తమ బిడ్డల ఆకలి తీర్చటానికి ఇంట్లో వస్తువుల్ని అమ్ముకోవాల్సిన దుస్థితికి గురవుతున్నారు.

afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి

Afghan Crisis

afghan crisis : అఫ్గానిస్థాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇష్టారాజ్యంగా విందు వినోదాల్లో తేలుతుంటే..ప్రజలు మాత్రం ఆకలితో అలమటించిపోతున్నారు. పిల్లల కడుపులు నింపలేకి నిస్సహాయ స్థితిలో ఇంట్లో వస్తువుల్ని కూడా తెగనమ్ముకుంటున్న దారుణ పరిస్థితులు అఫ్గాన్ దుస్థితిని నిదర్శనంగా కనిపిస్తున్నాయి.వేలకు వేలు పెట్టికొన్న వస్తువుల్ని కూడా అయినకాడికి అమ్ముకుంటున్నారు.పిల్లల ఆకలి మంటలు ఎలా తీర్చాలో తెలియక..చేయటానికి పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక వంట సరుకులు కూడా కొనలేని దుస్థితిలో ఇంట్లో పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. దీంతో పిల్లలు ఆకలి తీర్చటానికి ఇంట్లో టీవీలు, ఫ్రిజ్జ్ లు సోఫాలు వంటివి అమ్మేసుకుంటున్నారు. అమ్మేవారు ఎక్కువ కొనేవారు తక్కువగా ఉండటంతో అవికూడా అమ్ముడుకాని పరిస్థితి. ఇలా ఇంట్లో వస్తువుల్ని అమ్ముతుండటంతో అఫ్గాన్ రాజధాని కాబూల్ లో వీధులు, రోడ్లో సంతల్ని తలపిస్తున్నాయి. తగినంత ధర రాకపోయినా ఎంతో కొంత వస్తే పిల్లల ఆకలి తీర్చవచ్చు కదా అనుకుంటున్నారు. వేలకు వేలు పెట్టి కొన్న వస్తువుల్ని చాలా తక్కువ ధరలకే అమ్మేస్తున్నామని వాపోతున్నారు కాబూల్ వాసులు.

లాల్ గుల్ అనే వ్యక్తి మాట్లాడుతు నేను ఒకప్పుడు వ్యాపారిని. కానీ ఇప్పుడు నా ఇల్లు గడటానికే దిక్కులేదు. దీంతో నేను నా ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, సోఫాలు,అల్మారాలు అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే వ్యాపారం మాట ఎలా ఉన్నా..నా పిల్లల ఆకలి తీర్చటానికి ఇంట్లోకని లక్షలు పోసి కొన్న వస్తువుల్ని అమ్మేస్తున్నానని వాపోయాడు. రూ.25వేలు పెట్టి కొన్న ఫ్రిడ్జ్ రూ.5వేలకే అమ్మేశానని కానీ ఈ కాస్త డబ్బు నా ఇంటికి ఎన్ని రోజులు సరిపోతుందో..ఆ తరువాత పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదని తలపట్టుకుని కన్నీటితో చెప్పుకొచ్చాడు. ఇటువంటి దుర్బర స్థితిలో మా ఇంటిలోనే కాదు చాలామంది ఇళ్లలో విలువైన వస్తువులన్నీ రోడ్లమీదకే వస్తున్నాయని తెలిపాడు. ఒక్క వస్తువు ఎంతో కొంత ధరకు అమ్ముడైనా కనీసం నాలుగు రోజుల పాటు మా పిల్లల కడుపు నింపవచ్చని ఆశపడుతున్నామని తెలిపాడు. కొంతమంది ఇంట్లో వంట సామన్లు కూడా అమ్ముకుంటున్నారని తెలిపాడు.

అటువంటి మహ్మద్ అనే మరో బాధితుడు మాట్లాడుతూ..నేను తాలిబన్లు మా దేశాన్ని ఆక్రమించుకోకముందు నేను పోలీసు అధికారిగా పనిచేసేవాడిని. ఇప్పుడు పోలీసుల్ని ఉద్యోగాల నుంచి వెళ్లగొట్టారు. కొంతమందిని ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నారు డ్యూటీల్లోకి. కానీ జీతాలు ఇవ్వట్లేదని అంటున్నారు. నాకిప్పుడు ఉద్యోగం లేదు.ఇంకేం చేయాలి?అందుకే కొన్ని రోజులుగా నేను ఇక్కడే మార్కెట్ లో పనిచేస్తున్నాను. అలా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పిల్లలకు కాస్తంత అయినా భోజనం పెట్టగలుగుతున్నానని వాపోయాడు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోదీన గాథ. ఎవ్వరిని కదిలించినా ఏదోక విషాద గాథ చెప్పుకొస్తున్నారు.

కాగా 20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి దేశాన్ని స్వాధీనం చేసుకుని నెల దాటిపోతోంది. అధికారికంగా పాలనచేపట్టటానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో నెలకొన్న సంక్షోభంతో ఆర్థికంగా చాలా కష్టాల్లో కూరుకుపోయింది. మరో పక్క ఆహార కొరత అత్యంత దారుణంగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార నిల్వలు అందించినా అవి ఏపాటికిసరిపోవటంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజలు ఇంకెన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అనిపించేలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు.