Tollywood Drug Case : నవదీప్ 10 గంటలు విచారణ, ఏం చెప్పారో

టాలీవుడ్‌ డ్రగ్స్‌- మనీ లాండరింగ్ కేసులో యాక్టర్‌ నవదీప్‌ను సుదీర్ఘంగా 10 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు.

Navdeep : టాలీవుడ్‌ డ్రగ్స్‌- మనీ లాండరింగ్ కేసులో యాక్టర్‌ నవదీప్‌ను సుదీర్ఘంగా 10 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు. నవదీప్‌తో పాటు ఎఫ్‌ లాంజ్‌ క్లబ్‌ మేనేజర్‌పై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ విచారణ ముగిశాక బయటకు వచ్చిన నవదీప్‌… మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.డ్రగ్‌ పెడలర్‌ కెల్విన్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ లాంజ్ క్లబ్ అడ్డాగా పెద్దఎత్తున పార్టీలు జరిగినట్లు గుర్తించారు.

Read More : Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

2015 నుంచి 2017 మధ్య మూడేళ్లలో 30కిపైగా పార్టీలు ఎఫ్ లాంజ్ క్లబ్‌లో జరిగాయని.. ఈ పార్టీలకు టాలీవుడ్‌ యాక్టర్లు భారీగా హాజరయ్యారని తేల్చారు. ఎఫ్ లాంజ్ క్లబ్‌ మేనేజర్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. పార్టీలకు ముందు, తర్వాత ఎఫ్ లాంజ్ క్లబ్ అకౌంట్‌లోకి భారీగా డబ్బులు క్రెడిట్ అయినట్లు బ్యాంక్‌ స్టేట్‌మెంట్ ఆధారంగా నిర్ధారించారు. కొంతమంది యాక్టర్లు కూడా క్లబ్ మేనేజర్‌ అకౌంట్‌లోకి డబ్బు బదిలీ చేసినట్లు తేల్చారు. కెల్విన్, కమింగ్‌, పీటర్ అకౌంట్లను కూడా అధికారులు పరిశీలించారు.

Read More : Telugu States : రక్తమోడిన రోడ్లు, భార్య కళ్లెదుటే భర్త మృతి, రెడిమిక్స్ వాహనం కింద యువకుడు నుజ్జునుజ్జు

నవదీప్‌తో పాటు ఎఫ్ లాంజ్ క్లబ్ జీఎం అర్పిత్ సింగ్‌ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ వివరాలు కూడా బయటకు తీసింది. నవదీప్-అర్పిత్ మధ్య లావాదేవీలతో పాటు కెల్విన్‌తో జరిగిన ట్రాన్సాక్షన్స్‌పై అధికారులు ప్రశ్నించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. ఇక పార్టీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కెల్విన్, నవదీప్ పర్యవేక్షించినట్లు ఈడీ విచారణలో తేలింది. ఎఫ్ లాంజ్ అకౌంట్ నుంచి కెల్విన్, కమింగ్‌, పీటర్ అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు బయటపడింది. దీంతో.. ఎఫ్ లాంజ్ క్లబ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ కీలకంగా మారింది.  విదేశీ డ్రగ్‌ పెడలర్లతో జరిపిన లావాదేవీలపైనా ప్రశ్నించిన ఈడీ.. నవదీప్‌, ఎఫ్‌ లాంజ్‌ క్లబ్‌ జీఎం సమాధానాల్ని లిఖితపూర్వకంగా నమోదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు