Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై అప్పుడే ఓ వారం గడిచిపోయింది. ఓ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోగా హౌస్ నుండి వెళ్తూ సరయూ ఇంట్లో చాలా మందిని టార్గెట్ చేస్తూ వెళ్లిపోయింది.

Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలై అప్పుడే ఓ వారం గడిచిపోయింది. ఓ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోగా హౌస్ నుండి వెళ్తూ సరయూ ఇంట్లో చాలా మందిని టార్గెట్ చేస్తూ వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ సిరి, షణ్ముఖ్ జస్వంత్, లహరి లాంటి వాళ్ళను ఏకి పారేసిన సరయూ బయటకి వచ్చాక కూడా ఇంకా ఇంటి సభ్యులపై చిందులేస్తూనే ఉంది. అయితే.. ఉన్న వారిలో కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న సరయూ వారం రోజుల్లోనే ఈమె ఇంటి దారి పట్టడం కొందరు అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

కాగా, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మొదలై నామినేషన్ కూడా జరిగిపోయింది. కాకరేపిన రెండో వారం నామినేషన్‌ ప్రక్రియలో ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాళ్లు, ఉమాదేవి నోటి నుండి నానాబూతులు, యానీ మాస్టర్‌ బూతులు, శ్వేత ఉగ్రరూపం, ఏం జరుగుతుందో అర్ధంకాని షణ్ముఖ్ ఆశ్చర్యపోయి బిగుసుకుపోవడం ఇలా ఎన్నెన్నో విశేషాలు సోమవారం ఎపిసోడ్ లో చోటు చేసుకున్నాయి. ప్రతి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియను కొత్తగా మొదలు పెట్టే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియను కూడా అలానే చేపట్టారు.

Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

రెండో వారం నామినేషన్ లో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడదీశాడు. వాటికి నక్క టీము, గద్ద టీము అని పేర్లు పెట్టిన బిగ్ బాస్.. నక్క టీంలో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌ ఉండగా.. గద్ద టీములో లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక ఉన్నారు. హౌస్‌మేట్స్‌ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్‌ పూయాల్సి ఉంటుందని.. అయితే వాళ్ల టీమ్‌ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

ఇందులో సిరి కెప్టెన్ కావడంతో ఆమె సేఫ్. అయితే సిరికి నామినేషన్ చేసే ఛాన్స్ ఉండడంతో ఉమాదేవిని, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. నటరాజ్‌ మాస్టర్‌.. ప్రియ, ప్రియాంక సింగ్‌, యానీ మాస్టర్‌.. ఉమాదేవి, కాజల్‌, సన్నీ.. ప్రియను, ప్రియాంక సింగ్‌, ప్రియాంక.. నటరాజ్‌ మాస్టర్‌, సన్నీని, మానస్‌.. లోబో, ప్రియను, విశ్వ.. ఉమాదేవి, కాజల్‌ను, లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, శ్వేతను, ఉమాదేవి.. యానీ మాస్టర్‌, విశ్వలను నామినేట్ చేసింది. మొత్తానికి అలా నక్క టీమ్‌ నుంచి ఉమా, నటరాజ్‌, కాజల్‌, గద్ద టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు.