Tollywood : హీరోతో హీరోయిన్ డేటింగ్.. హీరో తల్లి వచ్చి గొడవ..?
ఈ ఘటన కొన్నాళ్ల క్రితం జరిగినా ఆ హీరోయిన్ ఇటీవల మళ్ళీ కనిపించడంతో ఈ చర్చ జరుగుతుంది. (Tollywood)
Tollywood
Tollywood : ఇండస్ట్రీ లోపల జరిగే విషయాలు అప్పుడప్పుడు లీక్ అయి వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు లేట్ గా కూడా లీక్ అవుతాయి. తాజాగా ఓ హీరో తల్లి – హీరోయిన్ తో గొడవ పడ్డ సంగతి బయటకు వచ్చింది. ఈ ఘటన కొన్నాళ్ల క్రితం జరిగినా ఆ హీరోయిన్ ఇటీవల మళ్ళీ కనిపించడంతో ఈ చర్చ జరుగుతుంది.
తమిళ భామ అయిన ఆ హీరోయిన్ తెలుగులో కూడా హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఓ హీరోతో రెండు సినిమాల్లో కలిసి నటించింది. అప్పట్లోనే ఈ ఇద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు ఆ హీరోయిన్ వేరే వ్యాపారవేత్తతో ప్రేమ ప్రకటించి త్వరలోనే పెళ్లి అని చెప్పి సినిమాలకు దూరమయింది. కానీ అది బ్రేకప్ అవ్వడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
Also Read : NTR : ఎన్టీఆర్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా.. కష్టంగానే వచ్చాడా? నిర్మాత చెప్పినా ‘డ్రాగన్’ రిలీజ్ పై సందేహమే..
అయితే కొన్నేళ్ల క్రితం ఆ టాలీవుడ్ హీరోతో తమిళ భామ డేటింగ్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ ఒక అపార్ట్మెంట్ లో హైదరాబాద్ లోనే ఉండేదట. హీరో అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడట. ఈ విషయం తెలిసిన హీరో తల్లి వచ్చి హీరోయిన్ తో పెద్ద గొడవ పెట్టుకుంది. ఈ గొడవ వల్లే హీరోయిన్ – హీరో మధ్య దూరం పెరిగి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోయిన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆ హీరోయిన్ అప్పట్లో చేసిన సంఘటనలు అన్ని వైరల్ అవుతున్నాయి.
