Tollywood heroine Samantha return from foreign and cinema shootings
Samantha : మయోసైటిస్ చికిత్స కోసం సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సమంత.. అమెరికా వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. ఇక అక్కడి నుంచి యూరోప్, దుబాయ్ అంటూ దేశాలను చుట్టేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చింది. ఒక పక్క వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూనే, మరోపక్క చికిత్స తీసుకుంటూ వచ్చింది. ‘ఖుషి’ సినిమాని కూడా ఫారిన్ లో ఉండే ప్రమోట్ చేసిన సమంత.. మళ్ళీ తిరిగి ఇండియాకి ఎప్పుడు వస్తుందని..? సినిమాల్లో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందని..? అభిమానులంతా ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా సమంత విదేశాలు నుంచి ఇండియా తిరిగొచ్చింది. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఈ అమ్మడు ల్యాండ్ అయ్యింది. బ్లాక్ అవుట్ పిట్ స్టైలిష్ లుక్ లో సమంత వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మయోసైటిస్ చికిత్స పూర్తి అయ్యిపోయిందా..? సమంత మళ్ళీ సినిమా షూటింగ్స్‌కి ఊ అంటుందా..? అని అభిమానులు ఉత్సాహ పడుతున్నారు. మరి సామ్ యాక్టింగ్ ని మళ్ళీ ఎప్పుడు షురూ చేస్తుందో చూడాలి.
Also read : Bigg Boss 7 : తోటి కంటెస్టెంట్‌ని నేలకేసి కొట్టిన హౌస్‌మెట్.. వైలెంట్‌గా మారిన బిగ్‌బాస్..
SAAAAAM ? After long time papped at Mumbai airport#Samantha #SamanthaRuthPrabhu @Samanthaprabhu2 pic.twitter.com/6EIyGfjlQy
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 19, 2023
సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. గతంలో తనకి ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బ్లాక్ బస్టర్ ని అందించిన రాజ్ డీకే ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్ట పడింది. ఒక పక్క మయోసైటిస్ తో బాధ పడుతున్న సమయంలోనే.. హార్స్ రైడింగ్, యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకోని మరి షూటింగ్ లో పాల్గొంది.