Radha Madhavam : విలేజ్ లవ్ డ్రామా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

ఎన్ని ప్రేమ కథలు వచ్చినా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీస్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా నిర్మాత గోనల్ వెంకటేష్ ‘రాధా మాధవం’ పల్లెటూరి ప్రేమ కథని..

Radha Madhavam : విలేజ్ లవ్ డ్రామా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

Tollywood new village backdrop love story Radha Madhavam first look

Updated On : November 14, 2023 / 8:22 PM IST

Radha Madhavam : ఎన్ని ప్రేమ కథలు వచ్చినా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీస్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పచ్చని వాతావరణం పల్లెటూరి సంస్కృతులతో ప్రేమ కథ చూస్తుంటే ఆ ఫీలింగ్ గుండెకు హత్తుకునేలా ఉంటుంది. ఈ బ్యాక్‌డ్రాప్‌తో ఎన్ని సినిమాలు వచ్చిన ఆడియన్స్ ఆదరిస్తూనే వచ్చారు. ఈ నమ్మకంతోనే నిర్మాత గోనల్ వెంకటేష్ ఒక పల్లెటూరి ప్రేమ కథని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్, పాటలను అందించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్టుప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ ని నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Also read : Children’s Day 2024 : టాలీవుడ్ స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోలు షేర్ చేసిన కల్కి డైరెక్టర్.. ప్రభాస్ టు కమల్..

పోస్టర్ రిలీజ్ అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. పోస్టర్ బాగా నచ్చినట్లు, చాలా ఇంటెన్స్‌గా ఉందంటూ చెప్పుకొచ్చారు. చిన్న చిత్రాలు అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. కాగా ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Tollywood new village backdrop love story Radha Madhavam first look