Chiranjeevi : సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌లో.. పద్మవిభూషణుడికి చిరు సత్కారం..

సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌లో పద్మవిభూషణుడు చిరంజీవికి సినీ ప్రముఖులు సత్కారం చేసారు.

Chiranjeevi : సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌లో.. పద్మవిభూషణుడికి చిరు సత్కారం..

Tollywood producers facilitates Chiranjeevi at south India film festival

Updated On : March 23, 2024 / 8:49 AM IST

Chiranjeevi : టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’. ఈ ఏడాదితో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. అలాగే టాలీవుడ్ లోని పలువురు దర్శకనిర్మాతలతో పాటు నటీనటులు కూడా హాజరయ్యారు. నిన్న మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ ఈవెంట్ లో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవిని చిత్ర ప్రముఖులు సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు చిరంజీవికి గౌరవ ప్రతిమలు అందించి, శాలువాతో సత్కరించారు. ఇదే ఈవెంట్ లో రీసెంట్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ.. చిరంజీవి హిట్స్ సాంగ్స్ కి డాన్స్ వేసి గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వస్తే.. చిత్రసీమ సన్మానించలేదు.. మురళీ మోహన్ కామెంట్స్

Tollywood producers facilitates Chiranjeevi at south India film festival Tollywood producers facilitates Chiranjeevi at south India film festival Tollywood producers facilitates Chiranjeevi at south India film festival Tollywood producers facilitates Chiranjeevi at south India film festival Tollywood producers facilitates Chiranjeevi at south India film festival Tollywood producers facilitates Chiranjeevi at south India film festival

కాగా ఈ ఈవెంట్ లో మురళీ మోహన్ మాట్లాడుతూ.. “జాతీయ ఉత్తమనటుడు అవార్డుని అందుకున్న అల్లు అర్జున్‌ ని చిత్రసీమ సన్మానించకుండా వదిలేసింది. ఇప్పుడు మెగాస్టార్ ని అయినా సన్మానిస్తున్నారు సంతోషం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదంటూ” అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.