Sankranthi 2025: రసవత్తరంగా మారిన టాలీవుడ్‌ పొంగల్‌ ఫైట్‌.. ఏయే సినిమాలు పోటీ పడుతున్నాయంటే?

చాలా మంది హీరోలు, దర్శక నిర్మాతలు.. తమ సినిమాలను సంక్రాంతి రేసులో ఉంచాలని అనుకుంటారు.

Sankranthi 2025: రసవత్తరంగా మారిన టాలీవుడ్‌ పొంగల్‌ ఫైట్‌.. ఏయే సినిమాలు పోటీ పడుతున్నాయంటే?

Updated On : October 22, 2024 / 9:26 PM IST

సంక్రాంతి టాలీవుడ్ ఫైట్ ఈసారి రసవత్తరంగా ఉండబోతోంది. చాలామంది హీరోలు సంక్రాంతికి కర్చీఫ్‌లు వేసేశారు. దీంతో ఎన్ని రిలీజ్ అవుతాయో.. ఎన్ని వాయిదా పడతాయో అనే ఆసక్తి కనిపిస్తోంది. ఐతే ఈ పొంగల్‌కు మెగా వర్సెస్ అల్లు ఫైట్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారబోతోంది. పుష్ప డిసెంబర్‌లోనే వస్తున్నాడు కదా.. మళ్లీ వార్ ఏంటి అనుకుంటున్నారా.. వాచ్‌ దిస్‌ స్పెషల్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ..

తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్‌ అంటే చాలా స్పెషల్‌. వరుసగా సెలవులు ఉంటాయి. దీంతో దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయ్‌. హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా కలెక్షన్లను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. కలెక్షన్లు బాక్సాఫీస్‌ను ముంచెస్తాయ్‌. చాలా మంది హీరోలు, దర్శక నిర్మాతలు.. తమ సినిమాలను సంక్రాంతి రేసులో ఉంచాలని అనుకుంటారు.

ఐతే ఫైనల్‌గా బెర్త్‌ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతికి భారీ కాంపిటీషన్ కనిపిస్తోంది. సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితి. ఐతే వాటి స్థానంలో వేరే సినిమాలు సై అంటున్నాయ్. ఐతే ఈ పొంగల్‌కు మెగా హీరోకు అల్లు కుటుంబానికి మధ్య ఫైట్‌ కనిపించబోతుంది. దీంతో ఈ పండగ మరింత స్పెషల్ గురూ అనిపిస్తోంది.

టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలు.. ఇప్పుడు సంక్రాంతి మీద కన్నేశారు. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ పక్కా అని
ప్రకటించాడు దిల్ రాజు. తాను కూడా సంక్రాంతికే అంటు బాలయ్య ప్రకటించేశాడు. ఐతే ఈ ఇద్దరి కంటే ముందే కర్చీఫ్ వేశాడు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ కూడా పెట్టాడు.

ఐతే రిలీజ్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా.. తాను సంక్రాంతికే అంటూ హల్చల్ చేస్తున్నాడు. చైతూ తండేల్ మూవీని పొంగల్‌కు రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారు. ఆ మూవీ పండగకు రిలీజ్ అయితే.. మెగా హీరో వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య యుద్ధం జరగబోతోంది..

తండేల్ మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయ్. ఎలాగూ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు తండేల్‌ కూడా వస్తే.. మెగా హీరో, అల్లు అరవింద్ మధ్య ఫైట్‌ కనిపించడం ఖాయం. ఇక చైతూ మేనమామ వెంకటేష్ కూడా.. తండేల్‌కు పుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. తన సినిమా వెనక్కి వెళ్తే.. తండేల్ రిలీజ్‌కు థియేటర్ల విషయంలో సపోర్ట్‌గా ఉండాలని చూస్తున్నాడు. గీతా థియేటర్లు, సురేష్ ఏసియన్ ధియేటర్లు.. అన్నపూర్ణ స్టూడియో ధియేటర్లు.. అన్నీ తండేల్‌కే. దీంతో బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోకి, అల్లు అరవింద్‌కు పోటీ ఉండడం ఖాయం.

Salman Khan : హత్య బెదిరింపులను పక్కనపెట్టి.. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సల్మాన్..