Rakesh Master : ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి..
టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విశాఖలో ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో అనారోగ్యానికి..

tollywood senior choreographer Rakesh Master passed away
Rakesh Master : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ అందర్నీ శోక సంద్రంలోకి నెట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న మాస్టర్.. విశాఖలో ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది.

tollywood senior choreographer Rakesh Master passed away