Singer Mangli : బావతో మంగ్లీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. మా బావతో పెళ్లి..!

టాలీవుడ్ సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుంది. మా బావతో నేను ఏడడుగులు వేయబోతున్నాను..

Singer Mangli : బావతో మంగ్లీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. మా బావతో పెళ్లి..!

Tollywood singer Mangli comments on her marriage rumours

Updated On : October 4, 2023 / 8:51 PM IST

Singer Mangli : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి మంగ్లీ.. ప్రైవేట్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ ఫేమ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ సింగర్ గా ఎదిగింది. తక్కువ టైంలోనే దాదాపు 100కి పైగా సాంగ్స్ ని పాడి ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకు పోతుంది. ఇక పండుగ సమయంలో ఈ సింగర్ ఒక స్పెషల్ డివోషనల్ సాంగ్ తో ఆడియన్సు ముందుకు వస్తుంటుంది. ఇలా ప్రతి సాంగ్ ని తనదైన శైలిలో పడుతూ అభిమానులను సంపాదించుకుంటూ వచ్చింది.

Also Read : Month of Madhu : లవర్స్ కోసం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సీక్రెట్ స్క్రీనింగ్.. మీరుకూడా వెళ్తారా..?

ఇది ఇలా ఉంటే, కొన్ని రోజులు నుంచి మంగ్లీ పెళ్ళికి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సింగర్ తన సొంత బావని పెళ్లాడబోతుంది అంటూ కథనాలు వస్తున్నాయి. త్వరలోనే బావతో కలిసి ఏడడుగులు వేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇక ఈ వార్తలు పై మంగ్లీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యింది. “ఓరి భగవంతుడా.. నాకు తెలియకుండానే నా పెళ్లి కూడా చేసేస్తున్నారా” అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది.

Also Read : Suma Kanakala : వెంకటేశ్వర స్వామి మాలలో రాజీవ్ కనకాల.. తిరుమలలో సుమ దంపతులు..

మంగ్లీ కామెంట్స్.. “నాకు పెళ్లి ఏంటి. ప్రెజెంట్ ఆ ఆలోచన ఏమి లేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. మా బావతో నేను ఏడడుగులు వేయబోతున్నాను అని రాసుకొస్తున్నారు కదా. నాకే తెలియని ఆ బావ ఎవరో కొంచెం నాకు కూడా చెబుతారా. అసలు ఈ పుకారు సృష్టించింది ఎవరు” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో మంగ్లీ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.