Telugu Movie Shootings: తగ్గేదేలే.. ఆగేదేలే.. షూటింగ్ ఆపని స్టార్స్!
కొవిడ్ దెబ్బకు మాక్సిమమ్ షూటింగ్స్ కి మళ్లీ బ్రేక్ పడింది. సినీ స్టార్స్ ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. సో ఇలాంటి టైమ్ లో బయటిక రావడానికి స్టార్స్ ఇష్టపడట్లేదు.

Telugu Movie Shootings
Telugu Movie Shootings: కొవిడ్ దెబ్బకు మాక్సిమమ్ షూటింగ్స్ కి మళ్లీ బ్రేక్ పడింది. సినీ స్టార్స్ ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. సో ఇలాంటి టైమ్ లో బయటిక రావడానికి స్టార్స్ ఇష్టపడట్లేదు. అయితే కొందరున్నారు. తగ్గేదే లే అంటూ సెట్స్ పై హల్చల్ చేస్తున్నారు. ఏమైనా కానీ సినిమా ఆగేదే లే అంటూ దూసుకుపోతున్నారు.
Shruti Haasan: లవ్ ఎఫైర్.. నేనే ముందంటూ శృతి బోల్డ్ స్టేట్మెంట్!
షూటింగ్ ఆపకుండా దడదడలాడిస్తున్నారు మాస్ రాజా. ఈ హీరో నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఒకేసారి ఐదారు సినిమాలను చేతిలో పెట్టుకున్న రవితేజ.. కాస్త రిలాక్స్ అయినా నష్టమే అనుకుంటున్నారు. అందుకే సెట్స్ పై ఉన్న రామారావు ఆన్ డ్యూటీని చుట్టేస్తున్నారు. ఈ సినిమాతో పాటూ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు పనులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసురను మొదలెట్సాల్సి ఉంది.
Ram Charan: 9 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ లోకి చెర్రీ.. ఇంత గ్యాప్ ఎందుకంటే?
సౌత్ టు నార్త్ వరుసగా సినిమాలకు కమిట్మెంట్స్ ఇస్తూ ఫుల్ బిజీగా మారింది సమంతా. టైమ్ వేస్ట్ చేయకుండా ఒక దాని తర్వాత మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెడుతుంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద షూటింగ్ హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ ను ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని రీసెంట్ గానే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ వంటి వారు నటిస్తోన్న యశోద సెకండ్ షెడ్యూల్ జనవరి 13తో పూర్తి చేయాలని ప్లాన్. అందుకే అందరూ ఆగినా.. అనుకున్న టైంకే బ్రేక్ తీసుకోబోతున్నారు యశోద టీమ్.
Anupama Parameswaran: డబ్బిస్తే ఏదైనా చేస్తావా.. అనుపమకి నెటిజన్ల ట్రోలింగ్!
ఈమధ్యే పట్టాలెక్కిన ధనుష్ సార్ సినిమా షూటింగ్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే కొవిడ్ బ్రేక్ తీసుకోకుండా ధనుశ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. సార్ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది.
Dil Raju Speech : సంక్రాంతికి ఈ సినిమాతో హిట్టు కొడుతున్నా..!
ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. లైగర్ ఆగిపోయిందంటూ విజయ్ దేవరకొండ డైరెక్ట్ గా చెప్పేశాడు కానీ ఆ లిస్ట్ లో చాలామందే ఉన్నారు. భీమ్లా నాయక్ మిగిలిన షూటింగ్ చేయాల్సిఉంది. సర్కారు వారి పాటకి బ్రేక్ పడింది. మిగిలిన హీరోలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటూ త్వరలో స్టార్ట్ చేద్దామనుకున్న ప్రాజెక్టులపై కూడా కరోనా గట్టిగానే కొట్టేలా ఉంది.