Tollywood young heroes impress audience with their writings also
Tollywood : నన్ను ఎవరు లేపనవసరం లేదు. నన్ను నేనే లేపుకుంటా అని విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్ అందరికి బాగానే గుర్తుకు ఉండే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఈ డైలాగ్ ని బాగా ఫాలో అవుతున్నారు. హిట్టు అందుకోవడం కోసం వారే స్వయంగా కలం పట్టుకొని తమ టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలా ఆకట్టుకుంటున్న హీరోలు ఎవరో ఓ లుక్ వేసేయండి.
సిద్ధూ జొన్నలగడ్డ..
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి హీరోగా ఎదిగిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఆడియన్స్ లో పెద్దగా గుర్తింపుని తెచ్చుకోలేకపోయారు. దీంతో ఆ గుర్తింపుని పొందడం కోసం.. డీజే టిల్లు సినిమాకి కథని, డైలాగ్స్ రాసి ఆడియన్స్ ని మెప్పించారు. దెబ్బకి ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో సిద్ధూ పేరు డీజే సౌండ్ వచ్చింది. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ కి కూడా కథని, డైలాగ్స్ అందించి 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
విశ్వక్ సేన్..
వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో హీరోగా నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో విశ్వక్ సేన్ తానే దర్శకరచయితగా మారి తెరకెక్కించిన సినిమా ‘ఫలక్‌నుమా దాస్’. ఈ మూవీతో మొదటి సూపర్ హిట్టుని అందుకున్న విశ్వక్.. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో కూడా దర్శకుడిగా పెద్ద హిట్టుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దర్శకుడిగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్‌ని, అలాగే మరో సినిమాని కూడా తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Also read : Vettaiyan : అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో ఎవరికి పోటీ..!
అడివి శేష్..
అడివి శేష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్న అడివి శేష్.. హీరో కావాలన్న కలని ‘క్షణం’తో తీర్చుకున్నారు. ఈ సినిమాకి తానే కథని, స్క్రీన్ ప్లేని రాసారు. అడివి శేష్ స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. ఆ తరువాత గూఢచారి, మేజర్ సినిమాలకు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే అందించి.. టాలీవుడ్ లో తన రైటింగ్ కి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆడియన్స్ అంతా గూఢచారి 2 కోసం ఎదురు చూస్తున్నారు.
నవీన్ పోలిశెట్టి..
ఈ నటుడు కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చి హీరోగా ఎదిగాడు. నవీన్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీకి స్క్రీన్ ప్లేని నవీన్ పోలిశెట్టినే రాసారు. ఇక ఇటీవల రిలీజైన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో కూడా తన పాత్రకి సంబంధించిన స్టాండప్ కమెడియన్ సీన్స్ ని తానే రాసుకున్నారు.
కిరణ్ అబ్బవరం..
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగిన కిరణ్ అబ్బవరం.. తన రెండో సినిమా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’కి రచయితగా మారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాకి మరోసారి కలం పట్టినా పెద్దగా వర్క్ అవుట్ లేదు.