Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7.. ఇండియాలో మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?
టామ్ క్రూజ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ 7 థియేటర్స్ లోకి వచ్చేసింది. విడుదలకు ముందే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

Tom Cruise Mission Impossible Dead Reckoning first day collections in India
Mission Impossible 7 : హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ (Tom Cruise) తన సినిమాల్లో చేసే యాక్షన్ స్టంట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ హీరో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి అయితే ఎంతో క్రేజ్ ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 6 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 7వ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ పార్ట్ ‘మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్’ (Mission Impossible Dead Reckoning) ని జులై 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
A R Rahman : రామ్ చరణ్ RC16 కి మ్యూజిక్ చేస్తున్నా.. ఆ సినిమా గురించి చెప్పడానికి..
2018 లో రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ 6 (Mission Impossible Fallout) ఇండియాలో మొదటి రోజు 9.25 కోట్లు రాబట్టింది. ఇక 7వ భాగం పై విడుదలకు ముందే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి వెకెండ్ కి గాను ఈ మూవీకి 25,000 అడ్వాన్స్ బుకింగ్‌స్ జరిగాయి. కేవలం మొదటిరోజే 12,000 టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే రూ.12.5 కోట్లు వసూలు రాబట్టింది. మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Sadha : గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ఈమధ్య విడిపోతున్నారు.. హీరోయిన్ సదా కామెంట్స్ వైరల్..
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొంతమంది ప్రపంచాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఓ సీక్రెట్ AI (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) తయారు చేస్తారు. కానీ అది వాళ్ళ మాట కూడా వినకుండా తనంతట తాను పని చేస్తూ ప్రపంచ వినాశనానికి కారణం అవ్వడానికి రెడీగా ఉంటుంది. దాన్ని నాశనం చేయడానికి ఆ AI సోర్స్ ఎక్కడ ఉంది, దాని తాళం కోసం హీరో అండ్ టీం చేసే పోరాటమే మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1.