కోవిడ్-19తో డేవిడ్ కన్నుమూత.. జరీనా వహాబ్ డిశ్చార్జ్

  • Published By: sekhar ,Published On : September 23, 2020 / 11:47 AM IST
కోవిడ్-19తో డేవిడ్ కన్నుమూత.. జరీనా వహాబ్ డిశ్చార్జ్

Updated On : September 23, 2020 / 12:13 PM IST

Tommy DeVito Dies from Covid-19, Zarina Wahab discharged from hospital: ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కోవిడ్-19 కారణంగా అమెరికాకు చెందిన పాప్‌ అండ్‌ రాక్‌స్టార్‌ టామీ డెవిటో కన్నుమూశారు. యు.ఎస్ లో పాపులర్ అయిన అమెరికన్‌ పాప్‌ అండ్ రాక్‌ బ్యాండ్‌ ఫోర్‌ సీజన్స్‌ సభ్యుడైన ఈయన సోమవారం కన్నుమూసినట్లు ఆయన మిత్రులు తెలిపారు.


టామీ డెవిటో 1929 జూన్‌ 19న జన్మించారు. తనకు తానుగా గిటార్‌ను ఎలా వాడాలో నేర్చుకుని ఎనిమిదేళ్ల వయసులో గిటారు వాయించారు. 1954 నుండి కలిసి రాక్‌ షోస్‌ను నిర్వహిస్తుండేవారు. ఈ కమ్రంలో 1960లో స్నేహితులతో కలిసి బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు. తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన చివరి ఆల్బమ్‌ 2006లో విడుదలైంది.


సీనియర్‌ బాలీవుడ్ నటి జరీనా వహాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆమె ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న జరీనా వహాబ్‌కు ఆక్సిజన్‌ లెవల్స్ తక్కువగా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు.


తాజాగా జరీనా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జరీనా వహాబ్‌ నటించారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవి కాంబినేషన్‌లో వేణు ఊడుగుల రూపొందిస్తోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో జరీనా వహాబ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.