Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ని వాడేస్తున్న పోలీసులు..

తాజాగా రిలీజైన ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ఉంది. ఇప్పుడు ఈ సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్..................

Mahesh Babu :  ‘సర్కారు వారి పాట’ని వాడేస్తున్న పోలీసులు..

Police

Updated On : May 3, 2022 / 12:56 PM IST

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాని మే 12 న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మే 2న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇది అందర్నీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో మహేష్ స్టైల్, డైలాగ్స్, లుక్స్ అన్ని చూసి మరోసారి వింటేజ్ మహేష్ కనిపించబోతున్నాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా అని డైరెక్టర్ తెలిపారు. ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మహేష్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Movie Promotions : కొత్త పుంతలు తొక్కుతున్న ప్రమోషన్స్.. యాంకర్స్ ని సైడ్ చేసేస్తున్నారుగా

తాజాగా రిలీజైన ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ఉంది. ఇప్పుడు ఈ సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్ కి వాడుతున్నారు. మహేష్ బాబు హెల్మెట్ పెట్టే షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్టీ ఫస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రమోట్ చేస్తున్నారు. గతంలో కూడా సినిమాలలోని కొన్ని సన్నివేశాలని వాడుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ ప్రమోట్ చేశారు పోలీసులు. దీంతో నెటిజన్లు మరోసారి పోలీసులని అభినందిస్తూ ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.