Vijay Sethupathi : విజయ్ సేతుపతి సినిమా సెట్‌లో విషాదం..

తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'విడుతలై'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా...

Vijay Sethupathi : విజయ్ సేతుపతి సినిమా సెట్‌లో విషాదం..

Tragedy on the sets of Vijay Sethupathi movie

Updated On : December 4, 2022 / 2:27 PM IST

Vijay Sethupathi : తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘విడుతలై’. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. రచయిత జయమోహన్ రాసిన ‘తునైవన్’ అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Vijay Sethupathi : షారుఖ్ కి విలన్ గా విజయ్ సేతుపతి.. ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్.. ఈ సారి బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..

ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో ఒక విషాదం చోటు చేసుకొంది. ప్రస్తుతం సినిమాలోని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సమయంలో ‘సురేష్’ అనే స్టంట్ మాస్టర్ ప్రమాదానికి గురికావడంతో హాస్పిటల్ కి తరలించారు.

తీవ్రగాయాలు అవ్వడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. చెన్నైలోని కేళంబాక్కంలో ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో తాడు తెగి ఫైటింగ్ కోచ్ సురేష్ కిందపడిపోయినట్లు తెలుస్తుంది. దీంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయింది. కాగా ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.