Trisha: ఒక స్టార్ హీరోయిన్ ని అలా అవమానిస్తారా.. మండిపడుతున్న త్రిష ఫ్యాన్స్
కరుప్పు ఆడియో లాంచ్ ఈవెంట్ కి హీరోయిన్ త్రిష(Trisha) రాకపోవడంపై మండిపడుతున్న ఫ్యాన్స్.
Trisha did not receive invitation for Karuppu movie audio launch event
- సూర్య త్రిషల వీరభద్రుడు సిద్ధం.
- ఆడియో వేడుకకు త్రిష దూరం.
- ఆహ్వానం అందలేదని నటి సెటైర్లు.
Trisha: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటించింది. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఆడియో లాంచ్ వేడుకకు చిత్ర యూనిట్ మొత్తం హాజరైనప్పటికీ, త్రిష కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Varanasi: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. ‘వారణాసి’ మూవీ క్రేజీ అప్డేట్
ప్రమోషన్లలో త్రిష(Trisha) పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న తరుణంలో, ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. సినిమాలో లాయర్ ప్రీతిగా తన లుక్‌ను ప్రశంసించిన ఒక నెటిజన్‌కు రిప్లై ఇస్తూ, చిత్ర బృందం తన ఉనికిని గుర్తించినందుకు సంతోషంగా ఉందంటూ సెటైర్లు వేసింది. ఈ క్రమంలోనే ఆడియో లాంచ్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించిన అభిమానికి, తన ఆహ్వాన పత్రిక బహుశా మెయిల్లో మిస్ అయి ఉంటుందని బదులిస్తూ తనకు అసలు పిలుపే అందలేదని పరోక్షంగా స్పష్టం చేసింది.
త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సీనియర్ స్టార్ హీరోయిన్‌కు ఆడియో లాంచ్ వంటి ముఖ్యమైన వేడుకకు ఆహ్వానం పంపకపోవడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్లలో పేరు వేసి, గౌరవంగా పిలవకపోవడం సరికాదని నెటిజన్లు మేకర్స్‌ను విమర్శిస్తున్నారు. ఈ వివాదం సినిమా ప్రమోషన్ల కంటే ఎక్కువగా వైరల్ అవుతుండటంతో, హీరో సూర్య లేదా చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
