Trisha-Udayanidhi Stalin: విజయ్ సీఎం అయ్యాక.. త్రిషకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఏకంగా 12 కోట్లు..
ఇలాంటి సమయంలో తాజాగా త్రిష కి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. (Trisha)
Trisha Krishnan Gets Huge Movie Offer From Udayanidhi Stalin After Vijay Became Cm
Trisha-Udayanidhi Stalin: తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. అయితే విజయ్ – త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారు అని వార్తలు రావడం, విజయ్ భార్య సంగీత విజయ్ వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని ఆరోపణలు చేస్తూ విడాకులు కోరడంతో గత కొన్నాళ్లుగా త్రిష కూడా వార్తల్లో నిలుస్తుంది. నిన్న జరిగిన విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
విజయ్ – త్రిష రిలేషన్ కంఫర్మ్ అని త్రిష ఇండైరెక్ట్ గానే హింట్స్ ఇస్తూ వస్తుంది. ఇక త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు వరుసగా చేస్తుంది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక త్రిష ఎలాంటి సినిమాలు చేస్తుందో అని చర్చ మొదలయింది. ప్రస్తుతం త్రిష చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడు షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.
Also See : Iswarya Menon : హీరోయిన్ ఐశ్వర్య మీనన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇలాంటి సమయంలో తాజాగా త్రిష కి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. తమిళ మీడియా సమాచారం ప్రకారం త్రిషకు ఏకంగా 12 కోట్లు ఆఫర్ చేస్తూ ఓ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తనయుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత, నిర్మాత ఉదయనిధి స్టాలిన్.
ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్జెయింట్ మూవీస్ బ్యానర్ పై కమల్ హాసన్ – రజినీకాంత్ కాంబోలో భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేస్తూ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో త్రిష ని హీరోయిన్ గా తీసుకుబోతున్నారట. ఈ సినిమాలో రజినీ, కమల్ సరసన త్రిష నటించడానికి ఏకంగా 12 కోట్లు ఆఫర్ చేశారట. సాధారణంగా త్రిష 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు సినిమాని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా 12 కోట్లు ఆఫర్ చేయడం గమనార్హం.
Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ?
విజయ్ ఎన్నికల్లో గెలవడం, సీఎం అవ్వడంతో త్రిష ఇమేజ్ తమిళనాడులో, బయట కూడా అమాంతం పెరిగింది. దీంతో ఆ ఇమేజ్ కూడా సినిమాకు పనికొస్తుందని గ్రహించి ఉదయనిధి స్టాలిన్ ఈ ఆఫర్ ఇచ్చాడని తమిళ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మూవీ టీమ్ త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక త్రిష కనక ఈ సినిమా ఓకే చేస్తే ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో సినిమా కాబట్టి మరోసారి త్రిష వార్తల్లో నిలవడం ఖాయం. గతంలో త్రిష ఆల్రెడీ కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరితో కలిసి నటించింది.
