Trisha : త్రిష లిప్ కిస్ ఇస్తాను అంటే.. ఆ హీరో వద్దన్నాడట.. ఆ సినిమాలో లిప్ కిస్ లేకపోవడమే మంచిదయింది..

96 సినిమా చాలా మంది మనసులకు హత్తుకుంది. అయితే ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి క్లైమాక్స్ లో మళ్ళీ ఇంకెప్పుడు కలవం అని చాలా ఎమోషనల్ అవుతారు. అయితే ఆ సీన్ లో సినిమా అంతా చాలా ప్యూర్ గా తీసుకెళ్లి చివర్లో ఒక్క ముద్దు అయినా పెట్టించాలని డైరెక్టర్ అనుకున్నాడట.

Trisha : త్రిష లిప్ కిస్ ఇస్తాను అంటే.. ఆ హీరో వద్దన్నాడట.. ఆ సినిమాలో లిప్ కిస్ లేకపోవడమే మంచిదయింది..

Trisha said ok to Lip Kiss Scene in 96 Movie but Vijay Sethupathi said no

Updated On : September 11, 2023 / 2:30 PM IST

Heroine Trisha : ఒకప్పుడు తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న త్రిష మధ్యలో కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ వరుసగా బిజీ అవుతుంది. త్రిష, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ముఖ్య పాత్రల్లో వచ్చిన 96 తమిళ్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో లవ్ ఎమోషన్స్ ని చాలా స్వచ్ఛంగా చూపించి, హీరో చిన్నప్పట్నుంచి ఒకే అమ్మాయి దగ్గర ఆగిపోయిన విషయాన్ని చాలా అందంగా చూపించారు.

96 సినిమా చాలా మంది మనసులకు హత్తుకుంది. అయితే ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి క్లైమాక్స్ లో మళ్ళీ ఇంకెప్పుడు కలవం అని చాలా ఎమోషనల్ అవుతారు. అయితే ఆ సీన్ లో సినిమా అంతా చాలా ప్యూర్ గా తీసుకెళ్లి చివర్లో ఒక్క ముద్దు అయినా పెట్టించాలని డైరెక్టర్ అనుకున్నాడట. ప్రేమగా లిప్ కిస్ ఇచ్చేలా డైరెక్టర్ సీన్ రాసుకున్నారు. ఇందుకు త్రిష కూడా ఓకే చెప్పిందట. కానీ విజయ్ సేతుపతి నో చెప్పాడట. తనకు ఇబ్బందిగా ఉందని, లిప్ కిస్ సీన్ చేయలేను అని చెప్పాడట.

Bigg Boss 7 Day 6 : ఆడియన్స్ ఎవరికి ఎన్ని మార్కులు ఇచ్చారు? 5 వారాలు హౌస్‌లో ప్లేస్ కంఫర్మ్ చేసుకున్న కంటెస్టెంట్?

దీంతో చేసేదేమి లేక చివరి సీన్ లో త్రిష సేతుపతి ముఖంపై చేతులు ఉంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఈ సీన్ ఆడియన్స్ కి మరింత ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. సినిమా అంతా ప్రేమని చాలా స్వచ్ఛంగా చూపించి చివర్లో అలాగే ఎండ్ చేశారు కాబట్టి సినిమా అంతా బాగా ఆడింది. ఒకవేళ నిజంగానే లిప్ కిస్ ఉండి ఉంటే ఆ కథకి సెట్ అయ్యేది కాదు అని, విజయ్ సేతుపతి నో చెప్పి మంచిపని చేశాడని, సినిమాలో లిప్ కిస్ సీన్ లేకపోవడమే మంచిదయింది అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇక విజయ్ సేతుపతి ఏ సినిమాలోనూ లిప్ కిస్ పెట్టనని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

Trisha said ok to Lip Kiss Scene in 96 Movie but Vijay Sethupathi said no