Tuck Jagadish: టక్ జగదీష్ సినిమా వాయిదా

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలకు వెనకడుగు వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన సినిమాల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ కూడా ఉంది.

Tuck Jagadish: టక్ జగదీష్ సినిమా వాయిదా

Tuck Jagadeesh

Updated On : April 13, 2021 / 11:02 AM IST

Tuck Jagadish: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలకు వెనకడుగు వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన సినిమాల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ కూడా ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య కూడా వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. సినిమా థియేటర్లపై ప్రభుత్వ నిబంధనలు లేనప్పటికీ కరోనా భయంతో ప్రేక్షకులు వెనకడుగు వేసే అవకాశం ఉండటంతో నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా మరో సినిమా వాయిదా పడింది. నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ విషయాన్నీ స్వయంగా హీరో నాని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు నాని. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ‘టక్‌ జగదీశ్’‌ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

‘విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాణంలో ‘టక్‌ జగదీశ్‌’ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఏప్రిల్‌ 23వ తేదీన విడుదల కావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)