Nirupam Paritala : డాక్టర్ బాబు హీరోగా ఎందుకు చేయలేదు? సినిమాల్లో ఛాన్సులు రాలేదా?

టీవీ నటుడు నిరుపమ్ పరిటాల తెలియని వారుండరు. డాక్టర్ బాబు అంటూ ఈజీగా గుర్తు పడతారు. బుల్లితెరపై ఎంతో పేరు సంపాదించుకున్న నిరుపమ్ బిగ్ స్క్రీన్‌పై హీరో ఎందుకు కాలేకపోయారు? ఎందుకు అవకాశాలు రాలేదు?

Nirupam Paritala : డాక్టర్ బాబు హీరోగా ఎందుకు చేయలేదు? సినిమాల్లో ఛాన్సులు రాలేదా?

Nirupam Paritala

Nirupam Paritala : బుల్లితెరపై ఓ రేంజ్‌లో క్రేజ్ ఉన్న నటుడు నిరుపమ్ పరిటాల గురించి తెలియని వారుండరు. ‘కార్తీక దీపం’ సీరియల్ మొదలైనప్పటి నుంచి నిరుపమ్ పేరుని మర్చిపోయిన ప్రేక్షకులు ‘డాక్టర్ బాబు’ గానే పిలుచుకుంటారు. 2008 నుంచి బుల్లితెరపై వరుసపెట్టి సీరియల్స్ చేస్తున్న నిరుపమ్ బిగ్ స్క్రీన్‌పై ఎందుకు హీరో కాలేదు? సినిమాల్లో ఛాన్సులే రాలేదా? తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.

KH 234 Movie : కమల్ – మణిరత్నం సినిమా.. 36 ఏళ్ళ క్రితం వచ్చిన నాయకుడు సీక్వెల్ ?

నిరుపమ్ పరిటాల దివంగత నటుడు, రచయిత ఓంకార్ కుమారుడని అందరికీ తెలుసు. అయితే తనదైన గుర్తింపుతో టీవీ స్క్రీన్‌పై మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ‘చంద్రముఖి’ సీరియల్ నుంచి మొదలుపెడితే కార్తీకదీపం, లేటెస్ట్ రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ అతనికి ఎనలేని పేరు తెచ్చాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు నిరుపమ్‌ను డాక్టర్ బాబుగా విపరీతంగా అభిమానిస్తారు. ఇన్ని సంవత్సరాలుగా టీవీ సీరియల్స్‌లో నటించిన నిరుపమ్ తాజాగా వైజయంతి బ్యానర్‌లో ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‌లో నిత్య మీనన్‌కి జోడిగా నటించి ఓ అడుగు ముందుకేసారు. నటనతో ఇంతలా ఆకట్టుకునే నిరుపమ్‌కి హీరో ఛాన్సులు ఎందుకు రాలేదు? బిగ్ స్క్రీన్‌పై ఆయన ఎందుకు నటించలేదు? అంటే నిరుపమ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Guppedantha Manasu : జగతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. దేవయాని, శైలేంద్రకు షాకుల మీద షాకులు

వరుసపెట్టి సీరియల్స్ చేస్తున్న టైంలో రెండు, మూడు సినిమా ఆడిషన్లలో పార్టిసిపేట్ చేసారట నిరుపమ్. ఆడిషన్ బాగానే ఉన్నా టీవీ సీరియల్స్ చేస్తున్నాననే కారణంగా తనను రిజెక్ట్ చేసారని చెప్పారు నిరుపమ్. ఆ టైమ్‌లో తనకి విపరీతమైన ఏడుపు వచ్చిందని తన తండ్రి ఫోటో ముందు ఏడ్చానని ఈ విషయం ఎవరికీ తెలియదని చెప్పారాయన. తండ్రి లేకపోవడంతో న్యూ కామర్ లాగ అయిపోయానని చెప్పారు. తనకు సినిమా సర్కిల్ లేకపోవడంతో అవకాశాల కోసం ఎవరి దగ్గరకి వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. అప్పట్లో తన పరిస్థితి బాధ కలిగించినా ప్రస్తుతం తను టెలివిజన్ రంగంలో చాలా సంతోషంగా పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కుమారి శ్రీమతి తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయని మంచి అవకాశాలు వస్తే భవిష్యత్ లో సినిమాల్లో పని చేస్తానని చెప్పారు నిరుపమ్ పరిటాల.