డాక్టర్ బాబుకు అష్టాచమ్మా అవకాశం మిస్ అయ్యింది

డాక్టర్ బాబుకు అష్టాచమ్మా అవకాశం మిస్ అయ్యింది

Tv Serial Actor Doctor Babunirupam Misses Ashta Chamma Chance

Updated On : May 14, 2021 / 6:18 AM IST

కార్తీకదీపం సీరియల్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ బాబు.. పరిటాల నిరుపమ్ తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్.. నానీ హీరోగా నటించిన అష్టాచమ్మా సినిమాకి హీరోగా ఆడిషన్స్‌కి వెళ్లారట. ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత అతని ప్లేస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నానీని హీరోగా పెట్టి సినిమా తీసేశారంట.

‘‘నేను సీరియల్స్‌లో బిజీగా ఉన్న సమయంలో.. ఇంద్రగంటి మోహనకృష్ణగారి ‘అష్టా చమ్మా’ చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని పిలిచారు. ఆడిషన్‌కు రమ్మనగానే వెళ్లాను. సినిమాలలో నటించాలనే కోరికతో వచ్చిన నాకు ఛాన్స్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అయితే, ఆడిషన్ చేయకుండానే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న నానిగారిని ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పట్లో చాలా బాధేసింది..’’ అని నిరుపమ్ చెప్పుకొచ్చాడు.

నేచురల్ స్టార్ నానీ మొదట ఇండస్ట్రీలోకి దర్శకుడు అవ్వాలనే వచ్చారు. బాపు రమణ వంటి అగ్ర దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా పనిచేశారు. ఇంద్రగంటి మోహన కృష్ణ ఒక్క అవకాశం ఇవ్వడంతో నానీ హీరోగా సెటిల్ అయిపోయాడు.