Two Souls Review : రెండు ఆత్మల ప్రేమ.. టు సోల్స్.. సిక్కిం అందాలలో అందమైన ప్రేమకథ..

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మాణంలో త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా స్రావం దర్శకత్వంలో టు సోల్స్ తెరకెక్కింది.

Two Souls Review : ఇటీవల చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులని కొత్త కొత్త కథలతో మెప్పిస్తున్నాయి. తాజాగా టు సోల్స్ అనే ఓ చిన్న సినిమా రిలీజయింది. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మాణంలో త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా స్రావం దర్శకత్వంలో టు సోల్స్ తెరకెక్కింది. యూట్యూబ్ ఫేమస్ రవితేజ మహదాస్యం, మౌనిక రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.

Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!

టు సోల్స్ కథ విషయానికి వస్తే.. హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్న ఓ అబ్బాయి అమ్మాయి ఆత్మలు శరీరం నుంచి బయటకు రావడంతో వారిద్దరికీ పరిచయం అయి ఆ పరిచయం ప్రేమగా మారే కథతో తెరకెక్కించారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది, క్లైమాక్స్ ట్విస్టులతో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తాయి. చివరి అరగంట ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. సెకండ్ హాఫ్ లో ప్రేమ సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. సినిమా అంతా సిక్కింలోనే తీశారు. దీంతో ఈ సినిమాలో సిక్కిం అందాలు చూడొచ్చు.

Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

కథ చాలావరకు కేవలం హీరో, హీరోయిన్స్ రెండు క్యారెక్టర్స్ మీదే నడుస్తుంది. వారి మధ్య సంభాషణలు, మ్యూజిక్, సాంగ్స్ ప్రేక్షకులని అలరిస్తాయి. కొత్త డైరెక్టర్ శ్రవణ్ ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో, తక్కువ పాత్రలో సిక్కింలో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఎడిటింగ్, DI కూడా డైరెక్టర్ శ్రవణ్ చేయడం గమనార్హం. చిన్న సినిమాగా థియేటర్స్ లో రిలీజయిన టు సోల్స్ మ్యూజిక్ లవర్స్, యూత్ ని మెప్పిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు