Leo Movie : ‘లియో’ గురించి బిగ్ హింట్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. అదేంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..

లియో సినిమా LCUలో భాగంగా వస్తుందా..? రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడా..? ఇలా పలు సందేహాలు ఉన్నాయి. అయితే వీటిలో ఒక దానికి ఉదయనిధి స్టాలిన్..

Leo Movie : ‘లియో’ గురించి బిగ్ హింట్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. అదేంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..

Udhayanidhi Stalin gave bigg hint on Vijay Leo Movie

Updated On : October 18, 2023 / 2:52 PM IST

Leo Movie : ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘లియో’. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా పై అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చాలా సందేహాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా LCUలో భాగంగా వస్తుందా..? రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడా..? ఇలా పలు సందేహాలు ఉన్నాయి.

అయితే వీటిలో ఒక దానికి తమిళ హీరో, నిర్మాత, రాజకీయనాయకుడు అయిన ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. లియో సినిమాని తమిళంలో ఉదయనిధి రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీని ఉదయనిధి చూసి రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారు. “లియో సూపర్ ఉందని, ఫైట్స్, లోకేష్ ఫిలిం మేకింగ్, అనిరుద్ సంగీతం.. అన్ని అదిరిపోయాయి” అంటూ మూవీ ఫస్ట్ రివ్యూని ఇచ్చేశారు. ఇక ఈ ట్వీట్ చివరిలో “LCU టీం ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేసి.. ఈ మూవీ LCUలో భాగంగా వస్తుందని కన్ఫార్మ్ చేసేశారు.

Also read : Ram Charan : ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్ జంట.. వరుణ్ తేజ్ పెళ్లి పనులు కోసమేనా..?

ఇక ఈ విషయం తెలియడంతో ఆడియన్స్ మరింత హై ఫీల్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, త్రిష, ప్రియా ఆనంద్.. ఇలా స్టార్ క్యాస్ట్ కనిపించబోతుంది. అలాగే ఒక సర్‌ప్రైజ్ స్టార్ ఎంట్రీ కూడా ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబరు 19న ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. కాగా తెలుగులో పోస్టుపోన్ అవ్వబోతుందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. రిలీజ్ కి ఎదురైన సమస్యని పరిష్కరించి రిలీజ్ కి సిద్ధం చేశారు మేకర్స్.