Unstoppable episode 5 : ఈసారి స్టార్ ప్రొడ్యూసర్‌ల వంతు.. అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్..
ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రజాదరణ పొంది.. టాక్ షోస్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. తాజాగా ఈ సీజన్ ఐదో ఎపిసోడ్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లతో పాటు స్టార్ డైరెక్టర్ ని తీసుకురాబోతున్నారు షో నిర్వాహకులు.

Unstoppable episode 5 guests are tollywood star producer along with star director
Unstoppable episode 5 : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రజాదరణ పొంది.. టాక్ షోస్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. నిజ జీవితంలో ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, అతిధులను కూడా ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ వారి జీవితంలోనే పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తున్నాడు.
Unstoppable episode 4 : చిరంజీవిలో నచ్చనిది ఏంటి.. బాలయ్యలో నచ్చేది ఏంటి.. రాధిక జవాబు!
సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని తీసుకువచ్చి, గత కొన్నేళ్లుగా చంద్రబాబు రాజకీయ ప్రయాణం గురించి ప్రజల్లో ఉన్న ఎన్నో సందేలకు చెక్ పెట్టాడు బాలకృష్ణ. ఆ తరువాత రెండు, మూడు ఎపిసోడ్స్ కి టాలీవుడ్ యంగ్ స్టార్స్ ని తీసుకు రాగా, నాలుగో ఎపిసోడ్ కి తన కాలేజీ మిత్రులతో కలిసి సందడి చేశాడు బాలకృష్ణ.
తాజాగా ఈ సీజన్ ఐదో ఎపిసోడ్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లతో పాటు స్టార్ డైరెక్టర్ ని తీసుకురాబోతున్నారు షో నిర్వాహకులు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు ఈ ఎపిసోడ్ కి గెస్ట్ లు గా రానున్నారు. వీరిద్దరితో పాటు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు హాజరుకానున్నాడు. ఇందుకు సంబందించిన షూటింగ్ ఈ బుధవారం జరగనుంది.