Unstoppable Season 3 : అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 షురూ.. దసరా ముందే.. మొదటి ఎపిసోడ్‌లో వచ్చేదెవరో తెలుసా?

ఇటీవల ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వబోతుందని, దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉందనున్నట్టు తెలుస్తుంది.

Unstoppable Season 3 : అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 షురూ.. దసరా ముందే.. మొదటి ఎపిసోడ్‌లో వచ్చేదెవరో తెలుసా?

Unstoppable Season 3 First Episode announced by Aha Streaming Before Dasara

Updated On : October 9, 2023 / 12:18 PM IST

Unstoppable Season 3 : ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అన్‌స్టాపబుల్ విత్ NBK షోకి ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని.. ఇలా చాలామంది స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు వచ్చి అభిమానులకు ఫుల్ సంతోషాన్ని ఇచ్చారు. గతంలోనే ఈ షోకి సీజన్ 3 కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది.

Also Read : Yatra 2 : యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి.. వైఎస్‌ జ‌గ‌న్ పాత్ర‌లో జీవా..

తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వబోతుందని, దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉందనున్నట్టు తెలుస్తుంది. మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం రానున్నట్టు ఆహా ప్రకటించింది. కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి అన్‌స్టాపబుల్ సీజన్ 3 షోలో మొదటి ఎపిసోడ్ కి రానున్నారు. భగవంత్ కేసరి సినిమా దసరాకి రిలీజ్ ఉండటంతో దసరా పండగ ముందే మొదటి ఎపిసోడ్ రానుంది. దీంతో బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు అన్‌స్టాపబుల్ సీజన్ 3 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.