Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

‘నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు’.. అంటూ ప్రోమోతో అంచనాలు పెంచేశారు బాలయ్య..

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

Unstoppable

Updated On : October 31, 2021 / 1:18 PM IST

Unstoppable with NBK: తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాక అంతకుమించి అనేలా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాలు, పాపులర్ షోలు, ఆకట్టకునే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసుల్లో తిరుగలేని స్థానాన్ని సంపాదించుకుంది.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

ఇప్పుడు ‘ఆహా’ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ చెయ్యబోతుంది. నటసింహా నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఆయనతో డిజిటల్ ఎంట్రీ ఇప్పిస్తోంది.. బాలయ్య హోస్ట్‌గా నెవర్ బిఫోర్ అనేలా ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతుంది. ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ స్నీక్ పీక్‌తో సందడి చేసిన ‘ఆహా’ టీం ఆదివారం ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Balakrishna: ఫిటింగ్‌లు పెట్టేదెవరూ? టీడీపీ పగ్గాలు బాలయ్య ఎందుకు తీసుకోలేదు?

మోహన్ బాబుని బాలయ్య సినిమాలు, రాజకీయాల మొదలు పర్సనల్ విషయాలు కూడా అడిగారు. కాంట్రవర్షియల్ కాకుండా ఆయన ప్రశ్నలడగడం, మోహన్ బాబు మాటలకు సెటైర్లు వెయ్యడం, మంచు లక్ష్మీతో స్టెప్పులెయ్యడం.. ఇలా ప్రోమో అంత రచ్చ రంబోలా అనేలా సాగిపోయింది.

Aha Nbk

బాలయ్య అనగానే ఆయన నోటి వెంట డైనమెట్స్‌లా పేలే పదునైన సంభాషణలు గుర్తొస్తాయి. ప్రోమోలోనూ బాలయ్య మార్క్ పంచ్ అడ్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి.. ‘నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు.. అంటూ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ప్రోమో చివర్లో ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఫినిషింగ్ ఇచ్చి అలరించారు. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసిన వాళ్లంతా ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.