Movies : ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
సమ్మర్(Summer) లో సినిమాల హడావిడి మొదలైంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మీడియం, చిన్న హీరోలు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

Up coming theatrical movies in May second Week
Movies : సమ్మర్(Summer) లో సినిమాల హడావిడి మొదలైంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మీడియం, చిన్న హీరోలు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. గత వారం వచ్చిన వాటిల్లో ఉగ్రం(Ugram) సినిమా, ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులని అలరించడానికి సినిమాలు రెడీ అయిపోయాయి.
తెలుగులో..
నాగచైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా తెలుగు, తమిళ్ లో మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రియ ముఖ్య పాత్రలో, మ్యూజిక్ నేపథ్యంలో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ సినిమా మే 12న రిలీజ్ కానుంది.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, వైవా హర్ష.. ఇలా పలువురు కమెడియన్స్ తో కామెడీ, థ్రిల్లింగ్ అంశంతో తెరకెక్కిన భువన విజయం సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది.
కళ్యాణమస్తు, ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ అనే చిన్న సినిమాలు కూడా మే 12న రిలీజవుతున్నాయి.
హిందీలో..
మన బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూట్ సినిమా ఛత్రపతి మే 12న రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఛత్రపతి సినిమాని VV వినాయక్ హిందీలో రీమేక్ చేశారు.
విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలో తెలుగు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన IB71 సినిమా బాలీవుడ్ లో మే 12న రిలీజ్ కానుంది.
వీటితో పాటు హిందీలో జోగిరా సారా రారా, రోస్ సినిమాలు మే 12న రిలీజ్ కానున్నాయి.
Vijay devarakonda : బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ.. ఈ సారైనా హిట్ కొడతాడా?
తమిళ్ లో..
ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటించిన ఫర్హానా తమిళ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ మే 12న రిలీజ్ కానుంది.
గుడ్ నైట్, పిజ్జా 3, రావణ కొట్టం, సిరువాం శ్యామ్యూల్.. సినిమాలు తమిళ్ లో మే 12న రిలీజ్ అవుతున్నాయి.