Upasana : ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ.. ఎవరు తయారు చేశారో తెలుసా..?

ఉపాసన పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ఒక ఉయ్యాల రెడీ బహుమతిగా పంపించింది. అయితే ఈ ఉయ్యాల తయారు చేసింది ఎవరో తెలుసా?

Upasana : ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ.. ఎవరు తయారు చేశారో తెలుసా..?

upasana gets handcrafted cradle for her baby as gift from prajwala foundation

Updated On : June 17, 2023 / 1:07 PM IST

Ram Charan – Upasana : రామ్ చరణ్, ఉపాసన తమ పెళ్ళైన 10 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆనందపరిచారు. మెగా వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ మరియు మెగా అభిమానుల్లో పండుగా వాతావరణం నెలకుంది. ఇక ఈ శుభవార్త విన్న కొందరు సెలబ్రిటీస్ ఉపాసనకు బహుమతులు పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అలియా భట్ (Alia Bhatt).. కొన్నిరోజులు క్రితం ఉపాసనకు ఒక బహుమతి పంపించింది.

Chiranjeevi – Ram Charan : కొరియన్ అంబాసడర్‌తో చిరు, చరణ్ భేటీ.. బంధాలు మరింత బలపడతాయి!

ఇక తాజాగా ప్రజ్వల ఫౌండేషన్ (Prajwala Foundation) వాళ్ళు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఉయ్యాలను పంపించారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది. ఆ ఉయ్యాలని ఫౌండేషన్ లోని కొంతమంది యువతులు తయారు చేశారు. వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడి యువతులు. ప్రస్తుతం ఫౌండేషన్ లో ఉంటున్న వారంతా.. ఉపాసన బిడ్డకి ఉయ్యాల రెడీ చేసి ఇంటికి బహుమతిగా పంపించారు. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Pawan Kalyan : నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, ప్రభాస్ ఇష్టం.. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్!

ఇది ఇలా ఉంటే, ఉపాసన ఇటీవల ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ప్రెగ్నెన్నీ గురించి ముందు రామ్ చరణ్ కి చెప్పగా.. ఒకసారి టెస్ట్ లు చేసి ఒకే అనుకున్న తరువాతే అందరికి చెబుదామని, సంబరాలు చేసుకుందామని చెప్పుకొచ్చాడట. ఇక తమకి పుట్టబోయే బిడ్డని చిరంజీవి దగ్గరే పెంచనున్నట్లు చెప్పుకొచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత అత్తమామల (చిరంజీవి-సురేఖ) దగ్గరకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)