దటీజ్ ఉపాసన కొణిదెల..

మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 07:08 AM IST
దటీజ్ ఉపాసన కొణిదెల..

Updated On : March 1, 2020 / 7:08 AM IST

మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..

మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన కొణిదెల. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపులకు చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనవంతు సమాజసేవ చేస్తుంటారు.

సోషల్ సర్వీస్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుంటారామె. తాజాగా పేదలకోసం ఉపాసన ఓ కొత్త కార్యక్రమం చేపట్టారు. మనకు అవసరం లేనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె.

ఈ మేరకు తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఆమె మంచి మనసుకు ‘దటీజ్ ఉపాసన’ అంటూ పొగుడుతున్నారు నెటిజన్స్.