Tollywood: టాలీవుడ్‌ అగ్ర హీరోలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రేక్షకులు ఎన్నడూ చూడని సరికొత్త సినిమాల రుచిని చూపడానికి..

తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు దేశ వ్యాప్తంగా టాలీవుడ్ అగ్ర హీరోలు తమ అప్ కమింగ్ సినిమాలతో అమితాసక్తి రేపుతున్నారు.

Tollywood: టాలీవుడ్‌ అగ్ర హీరోలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రేక్షకులు ఎన్నడూ చూడని సరికొత్త సినిమాల రుచిని చూపడానికి..

Upcoming Big Movies In Tollywood

Updated On : September 8, 2023 / 7:34 PM IST

Tollywood – Big Movies: కోలీవుడ్(Kollywood), బాలీవుడ్‌(Bollywood)లో రజినీ కాంత్, షారుక్ ఖాన్ వంటి పెద్ద హీరోల సినిమాలు వెండి తెరపై సందడి చేస్తున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా తమ అభిమాన తెలుగు హీరోల సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగులో పలువురు అగ్రహీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పలువురు టాలీవుడ్ అగ్రహీరోలు, వారి ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం..

ప్రభాస్ ఫాన్స్ అతడి తదుపరి సినిమా కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సినిమా వచ్చేదెప్పుడో, మోస్ట్ వయెలెంట్ మ్యాన్ ని స్క్రీన్ మీద చూసేదెప్పుడో అని ఎదురుచూస్తున్నారు.

అలాగే, కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ తో ఫిక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రభాస్ కల్కి మూవీ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -నాగ అశ్విన్ కాంబినేషన్లో దీపికా పదుకొణె, బిగ్ బీ అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి .. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

పవన్ కల్యాణ్?

ఈ పాన్ ఇండియా సినిమాల తర్వాత తెలుగు ప్రేక్షుకుల దృష్టంతా ఓజీపైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. పవన్ కల్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ ని పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఓజీ.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్త రూట్ మార్చిన పవన్ కల్యాణ్.. ఓజీలో మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ లో కొత్త యాంగిల్ చూపిస్తున్న సుజిత్.. ఓజీని భారీగా పాన్ ఇండియా లెవల్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ గ్లింప్స్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు.

అల్లు అర్జున్?

తగ్గేదే లే.. ఈ డైలాగ్ తెలీని, వినని, అనని వాళ్లు లేరేమో. ఆడియన్స్ కి బాగా దగ్గరైంది పుష్ప మూవీ. కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో బన్నీ.. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్‌వాంటెడ్ హీరో అయిపోయాడు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప- 2 ఎప్పుడెప్పుడు ధియేటర్లోకొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఫస్ట్ పార్ట్ కి మించి స్టార్ కాస్ట్.. రూ.400కి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప2కి బిజినెస్ ఆఫరే రూ.వెయ్యి కోట్లకు వచ్చిందంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే పుష్ప2 రిలీజ్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు జనాలు.

ఎన్టీఆర్?

ట్రిపుల్ ఆర్ తో అదరగొట్టి గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన కెరీర్ లో ఇప్పటివరకూ చెయ్యనంత యాక్షన్, ఎలివేషన్ స్టంట్లతో తెరకెక్కిస్తున్న సినిమా దేవర. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవరలో ప్రతిదీ ఆసక్తికర ఎలిమెంటే.

ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వి, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వారు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడంతో సినిమా మీద క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఏప్రిల్ 5న రిలీజవ్వ బోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్. రస్టిక్ లుక్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ నందమూరి ఫాన్స్ లోనే కాదు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

చెర్రీ?

వర్సటైల్ మూవీస్ తో ఎప్పుడూ కొత్తగా కనిపిస్తున్న రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ సినిమాతో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాలకు మించి ఆడియన్స్ లో ఇంట్రస్ట్ కలిగిస్తున్న మూవీ గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్, చరణ్ కాంబినేషన్లో 3 డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కోసం మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.

మహేశ్ బాబు?

సమ్ థింగ్ డిఫరెంట్ సినిమాలెన్నున్నా.. మహేశ్ -త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ ఉందంటే ఆ లెక్కే వేరు. ముచ్చటగా మూడోసారి ఇంట్రస్టింగ్ కాంబినేషన్లో థియేటర్లోకొస్తోంది గుంటూరు కారం. మహేశ్ -త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ మీద ఇప్పటికే విపరీతమైన హైప్ ఉంది.

రెండేళ్లక్రితం మహేశ్.. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేసి సాలిడ్ హిట్ కొట్టడంతో.. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ ఎంటర్ టైనర్ మీద కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు మహేశ్ మాసిజాన్ని ఓ రేంజ్ లో చూపిస్తున్న త్రివిక్రమ్.. మాస్ ఎలిమెంట్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చెయ్యడంతో గుంటూరుకారం మూవీ మోస్ట్ అవెయిటింగ్ అయిపోయింది.

Jawan Movie: జవాన్‌ సినిమాలో షారుక్ ఖాన్ పట్టుకున్న ఫోనుపై ఎందుకింత రచ్చ రచ్చ?