UI teaser : ఉపేంద్ర ‘యూఐ’ టీజర్.. అసలు ఊహించలేరు.. అదుర్స్..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న మూవీ యూఐ.

Upendra UI movie teaser out now
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న మూవీ యూఐ. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వినూత్నమైన ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. జి.మనోహరన్, కె.పి.శ్రీకాంత్ నిర్మింస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా నేడు టీజర్‌ను విడుదల చేసింది. 2040లో ప్రపంచం ఎలా ఉండనుందనేది ఇందులో చూపించారు.
Unstoppable with NBK S4 : శ్రీలీల, నవీన్ పోలిశెట్టి అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది..
ఆకలి తీర్చుకోవడానికి ప్రజల ప్రయత్నాలు, మనుషుల మధ్య గొడవలు చూపించారు. ఇక టీజర్ ఆఖరిలో ‘మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ’ ఉపేంద్ర చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.
ఈ చిత్రంలో రీష్మ ననైయ, సన్నీ లియోన్, జిషు సేన్‌గుప్త, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Kannappa : ‘కన్నప్ప’లో మంచు విష్ణు కుమార్తెలు.. ‘నా మనవరాళ్లు..’ అంటూ మోహన్ బాబు పోస్టు..