UI The Movie Teaser : ఇదేం టీజర్ రా బాబు.. నో విజువల్స్.. ఆడియోనే.. అయినా గానీ..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సి పని లేదు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘యూఐ : ది మూవీ’.

UI The Movie Teaser
UI The Movie : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సి పని లేదు. ఆయన నటించిన సినిమాలు కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. అంతేకాదు.. పలు టాలీవుడ్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘యూఐ : ది మూవీ’. నేడు ఆయన పుట్టిన రోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను బెంగళూరులోని ఊర్శశీ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ‘చీకటి.. అంతా చీకటి..’ అంటూ ఉపేంద్ర వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. అన్నట్లుగా టీజర్ మొత్తం చీకటిగానే ఉంది. కేవలం బ్యాగ్రౌండ్‌లో శబ్దాలు మాత్రమే వినిపించాయి.
Suriya – Karthi : అన్నయ్యతో కలిసి సినిమా పై కార్తీ కామెంట్స్.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
‘నీళ్ల శబ్దం వినబడుతోంది. ఈ చీకటి నుంచి తప్పించుకోవడం ఎలా. వెలుతురు పడ్డా.. అలికిడి అయినా ఎటాక్ చేస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం ఎలా.. ‘ అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక టీజర్ క్లైమాక్స్‌లో ‘ఇది AI ప్రపంచం కాదు.. ఇది UI ప్రపంచం. తప్పించుకోవడానికి మీ తెలివితేటలను ఉపయోగించండి!’ అంటూ వాయిస్ వినిపిస్తుంది. మొత్తంగా టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచాడనే చెప్పాలి.