Uppena Actors : ఖమ్మంలో బేబమ్మ-ఆర్సీల సందడి.. ఉప్పెనలా ఎగబడిన జనం

ఉప్పెన మూవీలో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ ఖమ్మంలో సందడి చేశారు. కేఎల్ఎమ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా బేబమ్మ-ఆర్సీలు గెస్టులుగా వచ్చారు. షారూంను ప్రారంభించారు.

Uppena Actors : ఖమ్మంలో బేబమ్మ-ఆర్సీల సందడి.. ఉప్పెనలా ఎగబడిన జనం

Uppena Fame Vaishnav Tej, Krithi Shetty Opening Klm Shopping Mall

Updated On : April 3, 2021 / 5:57 PM IST

Uppena fame Vaishnav Tej, Krithi Shetty : ఉప్పెన మూవీలో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ ఖమ్మంలో సందడి చేశారు. కేఎల్ఎమ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా బేబమ్మ-ఆర్సీలు గెస్టులుగా వచ్చారు. షారూంను ప్రారంభించారు. ఉప్పెన హీరోహీరోయిన్లు వచ్చారని తెలిసి చూసేందుకు జనం ఎగబడ్డారు. వేలం సంఖ్యలో జనం తరలిరావడంతో జనసంద్రంగా మారింది. ‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్‌ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు తొలి పరిచయమయ్యారు.

మొదటి చిత్రంతోనే వైష్ణవ్‌, కృతీలు భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్‌, బేబమ్మగా కృతి తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఖమ్మం వచ్చిన వీరిద్దరిని చూసేందుకు ఉప్పెనలా ఎగసిపడిన జనాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన ఈ మూవీకి భారీ స్థాయిలో రిస్పాన్స్ వచ్చింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చిన కృతి, వైష్టవ్ తేజ్ లను చూసేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై సినిమాల్లో ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమా.. అప్పటినుంచి ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు, దర్శకుడు ఫుల్ బిజీ అయిపోయారు.