Ustaad Bhagat Singh : మొదలైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పనులు..

గబ్బర్‌సింగ్ లాంటి సక్సెస్ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఇప్పుడు కలిసి 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ తన పాత సినిమాలని పూర్తి చేయడంలోనే చాలా ఆలస్యం అవుతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో అనే సందేహాలు మొదలయ్యాయి అభిమానుల్లో. అయితే ఈ సందేహాలకు చెక్ పెడుతూ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ టీం.

Ustaad Bhagat Singh : మొదలైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పనులు..

Ustaad Bhagat Singh pre production works is going on

Ustaad Bhagat Singh : గబ్బర్‌సింగ్ లాంటి సక్సెస్ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఇప్పుడు కలిసి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ఘనంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది అంటూ తెలియజేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం పవన్ తన పాత సినిమాలని పూర్తి చేయడంలోనే చాలా ఆలస్యం అవుతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో అనే సందేహాలు మొదలయ్యాయి అభిమానుల్లో.

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

అయితే ఈ సందేహాలకు చెక్ పెడుతూ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన విషయం చిత్ర యూనిట్ ఒక ఫోటో ద్వారా తెలియజేసింది. ఆర్ట్‌ డైరెక్టర్ ఆనంద్ సాయికి మూవీ కాన్సెప్ట్‌ డిజైన్‌ గురించి దర్శకుడు హరీష్‌ శంకర్‌ వివరిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ భగత్‌సింగ్ పనులు ఉస్తాద్‌గా జరుగుతున్నాయి అంటూ హింట్ ఇచ్చింది.

గతంలో ఈ ఆర్ట్‌ డైరెక్టర్ పవన్ తొలిప్రేమ సినిమాలోని తాజ్ మహల్ సెట్ ని నిర్మించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ డైరెక్టర్ ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో భాగం కావడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.