Baby Movie : బేబీ కోసం వస్తున్న 12 మంది సంగీత దర్శకులు.. డెబ్యూట్‌తోనే వైష్ణవి అదరగొడుతుందిగా!
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేబీ (Baby). కాగా ఈ సినిమాలోని పాటని రిలీజ్ చేయడానికి 12 మంది సంగీత దర్శకులు..

Pic Source - Twitter
Baby Movie : షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ భామ.. తాజాగా హీరోయిన్ గా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా బేబీ (Baby). ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రధాన హీరోగా కనిపిస్తుండగా, విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరో హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. గుండెకు హత్తుకునే స్కూల్ ప్రేమతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవి చైతన్య చుట్టూ సినిమా కథ మొత్తం సాగనుంది.
Manchu Manoj : ప్రేమించు, ప్రేమ పంచు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్!
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంది. టీజర్ లో ఇళయరాజ పెద్ద పెయింటింగ్ చూపిస్తూ.. ఈ సినిమాలో గుండెను కరిగించే సంగీతం ఉండబోతుంది అంటూ తెలియజేశారు. అన్నట్లుగానే మొదటి పాట ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’తో ఒక మ్యాజిక్ కి క్రియేట్ చేశారు. ఇప్పుడు రెండు సాంగ్ ని ఈరోజు (ఏప్రిల్ 3) సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటని రిలీజ్ చేయడానికి ఏకంగా 12 మంది సంగీత దర్శకులు రాబోతున్నారు. ‘దేవరాజా’ అనే సాగే ఈ సాంగ్ ని ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు లాంచ్ చేయనున్నారు.
Janhvi Kapoor : అతడితో జాన్వీ ప్రేమాయణం నిజమేనా.. తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న ఇద్దరు..
అయితే లాంచ్ చేసే ఆ 12 మంది దర్శకులు ఎవరన్నది తెలియజేయలేదు. కాగా ఈ సినిమాకి విజయ్ బుల్గేనిన్ సంగీతం అందిస్తున్నాడు. కలర్ ఫోటో చిత్రాన్ని నిర్మించి నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేష్ దర్శకుడిగా మారి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవి డిగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించబోతుంది. డైరెక్టర్ మారుతి, SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పథకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
12 music directors to launch #Devaraja song from #BabyTheMovie today.
First of its kind I think! ? pic.twitter.com/xHf3haYlqT
— idlebrain jeevi (@idlebrainjeevi) April 3, 2023