Manchu Manoj : ప్రేమించు, ప్రేమ పంచు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్!

మంచు మనోజ్ (Manchu Manoj) గత నెలలో భూమా మౌనిక రెడ్డిని (Bhuma Mounika) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు.

Manchu Manoj : ప్రేమించు, ప్రేమ పంచు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్!

Manchu Manoj and Bhuma Mounika celebrate their 1 month wedding anniversary

Updated On : April 3, 2023 / 4:36 PM IST

Manchu Manoj : గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మంచు బ్రదర్స్ (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య ఉన్న విబేధాలు వీడియో రూపంలో బయటకి రావడం, ఆ వీడియోని కూడా మనోజ్ స్వయంగా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక అప్పటినుంచి ఏదొక వైరల్ పోస్ట్ షేర్ చేస్తూనే వస్తున్నారు ఈ మంచు బ్రదర్స్. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఇటీవల వీడియో పోస్ట్ చేసి అందర్నీ అయోమయంలో పడేశాడు.

Manchu Manoj : నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం.. మంచు మనోజ్ సంచలన పోస్ట్!

ఆ వీడియోలో విష్ణు మాట్లాడుతూ.. మనోజ్ షేర్ చేసిన వీడియోలో జరుగుతున్న గొడవ నిజం కాదని, అది ఒక రియాలిటీ షో అంటూ చెప్పుకొచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. మరి ఈ రియాలిటీ షో కథ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ అలాగే వైరల్ అవుతుంది. మనోజ్ మార్చి 3వ తారీఖున భూమా మౌనిక రెడ్డిని (Bhuma Mounika) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో (ఏప్రిల్ 3) వీరి పెళ్లి అయ్యి నెల పూర్తీ కావడంతో, ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వీడియో షేర్ చేశాడు.

Manoj Vs Vishnu : చిలికి చిలికి గాలి వానగా మారాయి.. మనోజ్, విష్ణుల గొడవ గురించి స్పందించిన మోహన్ బాబు!

ఆ వీడియోలో మనోజ్ అండ్ మౌనిక నడుచుకుంటూ వస్తుంటే, వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ‘ప్రియా ప్రియా చంపోదే’ సాంగ్ వస్తుంది. ఇక ఈ వీడియోకి.. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఈ పెళ్లి మంచు విష్ణుకి ఇష్టం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే పెళ్లిలో ఎక్కడా మంచు విష్ణు కనిపించలేదని మాటలు వస్తున్నాయి.