Vakeel Saab: జనం కోసం పనిచేసే వకీల్.. టీవీలోకి వచ్చేస్తున్నాడు!
ఫీజు కోసం పనిచేసే లాయర్ కాదు.. జనం కోసం పనిచేసే వకీల్ సాబ్.. త్వరలోనే ఇంటింటికి వచ్చేస్తున్నాడు. జీ తెలుగు ట్విట్టర్ ద్వారా చెప్పిన మాట ఇదే. వకీల్ సాబ్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Vakeel Saab
Vakeel Saab: ఫీజు కోసం పనిచేసే లాయర్ కాదు.. జనం కోసం పనిచేసే వకీల్ సాబ్.. త్వరలోనే ఇంటింటికి వచ్చేస్తున్నాడు. జీ తెలుగు ట్విట్టర్ ద్వారా చెప్పిన మాట ఇదే. వకీల్ సాబ్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను టెలికాస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీ తెలిపింది. అయితే తేదీ ప్రకటించలేదు కానీ అతి త్వరలోనే అని ప్రకటించారు.
విరామం తర్వాత సాలిడ్ కం బ్యాక్ సినిమాగా సక్సెస్ కొట్టిన వకీల్ సాబ్ భారీ అంచనాలతో విడుదల అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే కరోనా కాలంలో విడుదల కావడంతో థియేటర్స్ లో రెండు వారాలు పాటు మాత్రమే నిలిచింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి రాగా అక్కడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వ్యూస్ రాబట్టింది. కాగా ఇప్పుడు త్వరలోనే టీవీలో కూడా ప్రసారం కానుంది.
వకీల్ సాబ్ థియేటర్లలో చూసిన అభిమానులు కూడా ఓటీటీలో విడుదల కాగానే మరోసారి సినిమాను చూసేశారు. అలా ఓటీటీలో వకీల్ సాబ్ ప్రసారమయ్యే స్క్రీన్ షాట్స్ తీసి అప్పట్లో అభిమానులు నానా హంగామా చేశారు. మరి ఇప్పుడు టీవీలో కూడా వస్తే అభిమానులు మరోసారి సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనకాడేలా లేరు. మరి టీవీ టీఆర్పీలు ఏ రేంజ్ లో దక్కించుకుంటుందో చూడాలి.
పైసల్ కోసం పని చేసే లాయర్ కాదు.. జనం కోసం పని చేసే వకీల్ ??⚖️
Watch the most awaited world television premiere of #VakeelSaab Coming soon on Zee Telugu.#VakeelSaabOnZeeTelugu #ComingSoon #VakeelSaabWorldTelevisionPremiere #ZeeTelugu @PawanKalyan #VenuSriram @MusicThaman pic.twitter.com/cKdvXSK5sY
— ZEE TELUGU (@ZeeTVTelugu) July 4, 2021