వకీల్ సాబ్ క్లైమాక్స్ సీన్ వైరల్.. ఈ ఫొటోలో గళ్లా చొక్కాతో ఉన్నది ఎవరు?

వకీల్ సాబ్ క్లైమాక్స్ సీన్ వైరల్.. ఈ ఫొటోలో గళ్లా చొక్కాతో ఉన్నది ఎవరు?

Updated On : January 7, 2021 / 12:04 PM IST

Vakeel Saab Climax Shooting : ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటుడు, విలన్ పాత్రలు పోషించే దేవ్ గిల్..తన ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోను పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, వకీల్ సాబ్ కు సంబంధించిన సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారనే చర్చ స్టార్ట్ అయ్యింది. ఇందులో గళ్లచొక్క, జీన్స్ వేసుకుని ఉన్న అతను..దేవ్ గిల్ ను కొడుతున్నట్లుగా ఉంది. అచ్చు అతను పవన్ కళ్యాణ్ లా ఉన్నాడని అనుకుంటున్నారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో చేసిన పోస్టులో మరొక ఫొటో కూడా ఇలాగే ఉంది. కానీ..స్పష్టంగా ఆ నటుడు కనబడడం లేదు. కానీ…దేవ్ గిల్ ఇటీవలే.. చేసిన ఓ ఫొటోలో గళ్లా చొక్కా, జీన్స్ ప్యాంట్ తో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీంతో అతను పక్కా పవన్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని టాక్. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పవన్ లాయర్ గెటప్‌లో అదిరిపోయాడు. తమన్ కంపోజ్ చేసిన ‘సత్యమేవ జయతే’ ఆర్ఆర్ బాగుందనే టాక్స్ వినిపించాయి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా సమానంగా చూపించనున్నామని, పవర్‌స్టార్‌కి ‘వకీల్ సాబ్’ పర్ఫెక్ట్ రీ ఎంట్రీ చిత్రం అవుతోందని నిర్మాతలు తెలిపారు. హిందీ (పింక్), తమిళ్ (నేర్కొండపార్వై) భాషల్లో చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ ‘మగువా మగువా’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Dev Gill (@actordevgill)