vakeel saab first day collection: బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‏ను దాటేసిన వ‌కీల్ సాబ్

వకీల్‌సాబ్‌కు వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత థియేటర్లకు దూసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్లన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది.

vakeel saab first day collection: బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‏ను దాటేసిన వ‌కీల్ సాబ్

Pawan Kalyan

Updated On : April 10, 2021 / 4:24 PM IST

Pawan Kalyan : వకీల్‌సాబ్‌కు వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత థియేటర్లకు దూసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్లన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది. ఓపెనింగ్ డే కలెక్షన్లలో కొన్నిచోట్ల ఆరేళ్ల బాహుబలి రికార్డులను సైతం తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 31 నుంచి 33 కోట్లు వసూలు చేసిందని అంచనావేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ 40 కోట్ల కలెక్షన్లు సాధించిందని సినీ వర్గాలు అంటున్నాయి. కరోనా కాలంలోనూ పవన్ చేసిన మ్యాజిక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో….రానున్న రోజుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు. తొలిరోజు కలెక్షన్లపై ఇంకా అధికారిక లెక్కలు విడుదల కాలేదు.
అమితాబ్ పింక్ రీమేక్‌గా తెరకెక్కిన వకీల్‌సాబ్‌…పవన్ ఇమేజ్‌తో ఇక్కడ భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. పవన్ గత సినిమాలు అజ్ఞాతవాసి కాటమరాయుడు, సర్దార్ గబ్బర్‌సింగ్‌తో పోలిస్తే…కరోనా కాలంలోనూ తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించింది.

అజ్ఞాతవాసి తొలిరోజు కలెక్షన్లు 27 కోట్లు ఉండగా, కాటమరాయుడు 22 కోట్లు, సర్దార్ గబ్బర్‌సింగ్‌ 21 కోట్లు వసూలు చేశాయి. …కరోనా కాలంలోనూ వకీల్‌ సాబ్‌ తొలిరోజు కలెక్షన్లు…మూడేళ్లక్రితం భారీ అంచనాలతో విడుదలైన అజ్ఞాతవాసిని మించిపోయాయి. గుంటూరు జిల్లా మాచర్లలో బాహుబలి తొలిరోజు కలెక్షన్లును మించి ఉన్నాయి వకీల్ సాబ్ కలెక్షన్లు. చిత్తూరులో 15 లక్షల 68వేల సాధించగా, కృష్ణా జిల్లాలోనూ కోటీ 90లక్షలు వసూలు చేసింది. రానున్న రోజుల్లో వకీల్ సాబ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని భావిస్తున్నారు.


Read More : Gurgaon Restaurant : కరోనా టీకా వేసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడో తెలుసా