Constable Song : వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ నుంచి ఐటెం సాంగ్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా కానిస్టేబుల్ సినిమా నుంచి ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. (Constable Song)

Constable Song
Constable Song : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కానిస్టేబుల్’. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కానిస్టేబుల్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేసారు.(Constable Song)
తాజాగా కానిస్టేబుల్ సినిమా నుంచి ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. భరత్ భూషణ్ సినిమా హిట్ అవ్వాలని మూవీ యూనిట్ కి అభినందనలు తెలిపారు. దావత్ అనే ఈ పాటను శ్రీనివాస్ తేజ రాయగా సుభాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో గీతా మాధురి పాడింది. మీరు కూడా ఈ స్పెషల్ సాంగ్ చూసేయండి..
Also Read : Sasivadane : అశ్లీలతకు తావు లేకుండా సినిమా చేశాం.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న శశివదనే..
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ కు ఈ సినిమా మరో మలుపు అవుతుందని అన్నారు. నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల 10న ఇలాంటి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాం అని అన్నారు. డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ.. ట్రైలర్ కు వచ్చిన స్పందనతోనే మేము సగం విజయం సాధించాము. 50 లక్షల మది ట్రైలర్ చూడడం అంటే మామూలు విషయం కాదని అన్నారు.