Varun Sandesh Induvadana : వామ్మో.. మరీ ఇంత బోల్డా.. హాట్ టాపిక్‌గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్
ఇందువదన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. చర్చకు దారితీసింది. ఇందులో హీరో హీరోయిన్ బోల్డ్‌గా కనిపించడమే కారణం.

Varun Sandesh Induvadana
Varun Sandesh Induvadana : హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించాయి. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ షో లో తన భార్యతో కలిసి సందడి చేశాడు వరుణ్. బిగ్ బాస్ షో తో వరుణ్ సందేశ్‌కు కొంత క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న వరుణ్.. మళ్లీ కెమెరా ముందుకి వచ్చాడు. ఎం.ఎస్.ఆర్ డైరెక్షన్ లో ఇందువదన అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్ శెట్టి కథానాయిక. మాధవి ఆదుర్తి నిర్మాత.
ఇందువదన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. చర్చకు దారితీసింది. ఇందులో హీరో హీరోయిన్ బోల్డ్‌గా కనిపించడమే కారణం. వరుణ్ సందేశ్.. క్లాసిక్ డేస్ కళాకారుడిలా శోభన్ బాబు రింగుతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
View this post on Instagram
పోస్టర్‌తో మూవీపై మేకర్స్ ఆసక్తిని కలిగించారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, ఈ సినిమాను 2021లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
View this post on Instagram