Varun Tej : సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ కామెంట్స్. సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..

Varun Tej : సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..

Varun Tej comments on Pawan Kalyan at Bro movie pre release event

Updated On : July 25, 2023 / 11:35 PM IST

Varun Tej – Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మెగా వారసులు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

OG Movie : పవన్ కళ్యాణ్ OG స్టిల్స్ చూశారా..? నెట్టింట పిక్స్ వైరల్.. బీస్ట్ మోడ్ ఆన్..!

ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..

బాబాయ్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడని తెలుసు ముందు కొంచెం అసూయ పడ్డాను. కానీ ఆ తరువాత ఎంతో సంతోష పడ్డాను. ఎందుకంటే తేజ్ కి బాబాయ్ అంటే ఎంతో ప్రత్యేకం. ఆయన్ని ఒక గురువుగా భావిస్తాడు. వాడికి ఈ సినిమా జీవితాంతం గుర్తుండి పోతుంది. ఇక స్టేజి పై బాబాయ్ గురించి మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడు మొదటిసారి వచ్చింది. ఆయన గురించి చెప్పాలంటే.. చిన్నప్పుడు నుంచి మాకు ఎప్పుడు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పలేదు. మీకు మీరే తెలుసుకోవాలని మమల్ని స్వేచ్ఛగా వదిలేశారు.

OG Movie : ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.. కానీ డబల్ రేటుకి OG రైట్స్..!

ఇప్పుడు ఆయన సినిమాలు వదిలి రాజకీయం వైపు వచ్చారు. ఒక కొడుకుగా ఆయన అలా ఎండలో ప్రజల కోసం కష్టపడుతుంటే ఎంతో బాధ వేస్తుంది. నాకు మాత్రమే కాదు మా కుటుంబం మొత్తం కూడా బాధ పడుతుంటుంది. అయితే ఆయన మా కుటుంబాన్ని వదిలి మీ కుటుంబాల కోసం వచ్చాడని సంతోష పడుతుంటాం. ఆయన సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా మా కుటుంబం మొత్తం ఆయన వెనుకే ఉంటాం.