Varun Tej : కొత్త మూవీ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్షన్ చిత్రాలను స్టైలిష్ గా తెరకెక్కించే ప్రవీణ్ సత్తారుతో కలిసి వరుణ్ తేజ్ తన 12వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Varun Tej : కొత్త మూవీ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్..

Varun Tej

Updated On : January 17, 2023 / 1:22 PM IST

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది ఒక విజయాన్ని ఒక పరాజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. యాక్షన్ చిత్రాలను స్టైలిష్ గా తెరకెక్కించే ప్రవీణ్ సత్తారుతో కలిసి వరుణ్ తేజ్ తన 12వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ లో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మూవీ లాంచ్ తప్ప ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేయ లేదు.

Varun Tej: దీపావళి పండుగ నాడు గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో వరుణ్ తేజ్..

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే డేట్ ని అనౌన్స్ చేశారు. జనవరి 19న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ గన్ పట్టుకొని ఉండగా, బ్యాక్ గ్రౌండ్‌లో ఫారిన్ లొకేషన్ కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ మరియు నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. ఇక నాగార్జునతో తీసిన ‘ఘోస్ట్’ సినిమా ఆశించిన విజయ అందుకోకపోవడంతో.. ఈ సినిమాని చాలా కసిగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కాగా ఈ సినిమాతో పాటు తన 13వ సినిమాని కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఆ చిత్రంలో ఈ మెగా హీరో పైలట్ గా కనిపించబోతున్నాడు.