Varun Tej : ఆ సినిమా కోసం పొట్ట పెంచుతున్న వరుణ్ తేజ్? 50 ఏళ్ళ వ్యక్తిగా?
మొదటి నుంచి వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ప్రతి సినిమాకి తనను తాను మలుచుకుంటున్నాడు.

Varun Tej Growing his Belly for Matka Movie Rumours goes Viral
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వకపోయినా విమర్శకులని మెప్పించింది. వరుణ్ ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా'(Matka) అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
ఆల్రెడీ మట్కా సినిమా నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మట్కా సినిమా మూడు కాలాల్లో జరుగుతుందని, వరుణ్ తేజ్ 20 ఏళ్ళ కుర్రాడిలా, 30 ఏళ్ళు పైబడిన వ్యక్తిలా, 50 ఏళ్ళ వయసు పాత్రలో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ మూడు పాత్రల్లో కనిపించడానికి సహజంగా తన బాడీని మార్చుకుంటున్నాడు. 50 ఏళ్ళ పాత్ర కోసం సహజంగా పొట్ట పెంచుతున్నాడట. కొంచెం లావు అయి, కొంచెం పొట్ట పెంచుకొని పెద్ద వ్యక్తిలా కనిపించబోతున్నాడట. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.
మొదటి నుంచి వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ప్రతి సినిమాకి తనను తాను మలుచుకుంటున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాకు అయితే బాగా బాడీ, గడ్డం పెంచి చాలా మారాడు. ఇలా ఏ పాత్రకు తగ్గట్టు ఆ పాత్రలోకి ఒదిగిపోవడానికి వరుణ్ కష్టపడుతున్నాడు. ఇప్పుడు మట్కా సినిమా కోసం పొట్ట పెంచడానికి సిద్ధం అయిపోయాడు. దీంతో మరోసారి వరుణ్ ని అంతా అభినందిస్తున్నారు.
Also Read : Robert Downey : 30 ఏళ్లుగా ట్రై చేస్తుంటే.. హమ్మయ్య ఎట్టకేలకు ఐరన్ మ్యాన్‌కు ఆస్కార్ వచ్చింది.. కానీ..
ఇక మట్కా సినిమా వరుణ్ తేజ్ మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి మట్కా సినిమా అయినా వరుణ్ కి కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.