Fear Trailer : వేదిక ‘ఫియర్’ ట్రైలర్ రిలీజ్.. భయపెట్టబోతున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్..
మీరు కూడా ఫియర్ ట్రైలర్ చూసేయండి..

Vedhika Fear Movie Trailer Released
Fear Trailer : వేదిక మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న సినిమా ఫియర్. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రానుంది. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాణంలో డా.హరిత గోగినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫియర్ సినిమా డిసెంబర్ 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఫియర్ ట్రైలర్ చూస్తుంటే.. ఓ లవ్ స్టోరీతో హీరోయిన్ ఒక్కటే ఇంట్లో ఉంటే తనని ఎవరో వెంటాడుతున్నట్టు చూపించారు. ఈ ఫియర్ సినిమా థియేటర్స్ లో ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి. మీరు కూడా ఫియర్ ట్రైలర్ చూసేయండి..
ఇక ఫియర్ సినిమా ఇప్పటికే రిలీజ్ కి ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70కి పైగా అవార్డ్ లను గెలుచుకుంది. ఈ ట్రైలర్ ను మాధవన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.