Veekshanam : వెంకటేష్ గారు చెప్పిన మాటే ఈ సినిమాకు మూలం.. వీక్షణం డైరెక్టర్ కామెంట్స్..
కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో రాబోతున్న వీక్షణం సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కాబోతుంది.

Veekshanam Movie Director Manoj Palleti Interesting Comments on Movie Story
Veekshanam : రామ్ కార్తీక్, కశ్వి జంటగా రాబోతున్న సినిమా ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో ఈ వీక్షణం సినిమా తెరకెక్కింది. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కాబోతుంది. తాజాగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి, మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి నేడు మీడియాతో ముచ్చటించారు.
డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో నేను డీఎఫ్‌టీ కోర్స్ చేసేటపుడు వెంకటేష్ గారు.. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని ఒక మాట చెప్పారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా కథకు మూలం. అప్పట్నుంచే వీక్షణం కథ రెడీ చేసుకున్నాను. కొంతమంది నిర్మాతలకు కథ వినిపించాను. కథ బాగున్నా కొత్త డైరెక్టర్ ని కావడంతో ఆలోచించారు. దీంతో మా ఊరికి వెళ్లి అక్కడ ప్రొడక్షన్ ట్రై చేశాను. అలా పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి, మేము కలిసి ఈ సినిమా మొదలుపెట్టాము. థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం మా సినిమా ప్రత్యేకత. ఈ కథలో చాలా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండవు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడొచ్చు. మంచి కంటెంట్ మా వీక్షణం సినిమాలో ఉంది. సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనే కథతో థ్రిల్లర్ కామెడీగా సినిమాని తెరకెక్కించాము అని తెలిపారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. నేను కోటి గారి దగ్గర కొన్నాళ్ళు వర్క్ చేశాను. అప్పుడే ఎంఎస్ రాజు గారి దగ్గర ఆఫర్ రావడంతో ఆయన డైరెక్ట్ చేసిన 7 డేస్ 6 నైట్స్ సినిమాకు మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో 3 పాటలు ఉండగా ఒకటి సిధ్ శ్రీరామ్ పాడారు. నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని లిరిసిస్ట్ రెహమాన్ గారు చాలా సపోర్ట్ చేశారు అని తెలిపారు.