Venkaiah Naidu : నేటి సినిమా మేకర్స్ పై వెంకయ్య నాయుడు విమర్శలు.. డబల్ మీనింగ్ డైలాగ్స్..

ప్రస్తుతం సినిమాల్లో వస్తున్న డబల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. నేటి సినిమా మేకర్స్ పై విమర్శలు చేశారు.

Venkaiah Naidu : నేటి సినిమా మేకర్స్ పై వెంకయ్య నాయుడు విమర్శలు.. డబల్ మీనింగ్ డైలాగ్స్..

Venkayya Naidu about double meaning dialogues and scenes in today movies

Updated On : September 20, 2023 / 4:32 PM IST

Venkaiah Naidu : టాలీవుడ్ అగ్ర నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ (Akkineni Nageswara Rao) శతజయంతి నేడు (సెప్టెంబర్ 20) కావడంతో నాగార్జున కుటుంబం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతులు మీదుగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. నేటి సినిమా మేకర్స్ పై విమర్శలు చేశారు.

Vishal : చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్..

“అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినిమాల్లో సంప్రదాయాలు, విలువలు గురించి చూపిస్తూ వచ్చారు. ఆయన తన సినిమాల్లో వినోదంతో పాటు విద్య, సందేశం కూడా ఇచ్చారు. ఆయన నటించిన సినిమాలు చూసి యువత ఎంతో నేర్చుకోవచ్చు. కానీ నేటి సినిమాలో ఆ విలువలు కనిపించడం లేదు. రాజకీయం కంటే సినిమా ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి సినిమాల్లో డబల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు పెట్టి ఇప్పటి యూత్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి సీన్స్ లేకున్నా సినిమాలు నడుస్తాయి. ఆ విషయం ఇప్పటివారికి అర్ధం కావడం లేదు. సినిమా అనేది వర్తమానానికి భవిష్యత్తుకు వారధి లాంటిది. అలాంటి సినిమాలు తెరకెక్కించడంలో కొంచెం జాగ్రత్త వహించాలని ఇప్పటి దర్శకులను, నిర్మాతలను, నటీనటులను నేను కోరుతున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.

Celebrating ANR 100 : అక్కినేని కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్ నటుడు..

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో బూతు డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మేకర్స్ చూస్తున్నారు. వీటిపై ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడు వెంకయ్య నాయుడు కూడా మాట్లాడారు. మరి టాలీవుడ్ మేకర్స్ దీనిపై ఏమన్నా ఆలోచిస్తారా అనేది చూడాలి.