Venkaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ..
నేడు ఉదయం అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు.

Venkayya Naidu Unveiling the Idol of Akkineni Nageswara Rao in Annapurna Studios
Venkaiah Naidu : 20 సెప్టెంబర్ 1924 కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో పుట్టిన అక్కినేని నాగేశ్వరరావు(ANR) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అలాగే మహేష్ బాబు, రామ్ చరణ్, మంచు విష్ణు, జగపతిబాబు, నాజర్, బ్రహ్మానందం.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కినేని నిల్చొని ఉన్న విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఆవిష్కరించారు.
విగ్రహావిష్కరణ అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులంతా అక్కినేనితో తమకు ఉన్న బంధం గురించి మాట్లాడారు.