వెంకీ, చైతు ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్, అండ్ న్యూ స్క్రాంబ్లర్ మోడల్స్..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్, అండ్ న్యూ స్క్రాంబ్లర్ మోడల్స్..
రియల్ లైఫ్ మామా, అల్లుళ్ళు.. విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి ఒక షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్.. డుకాటి ఇండియా.. రీసెంట్‌గా భారతదేశంలో తమ 9వ షోరూమ్‌ను హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్ నెం. 12లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్, నాగ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకీ, రిబ్బన్ కట్ చేసి లగ్జీరియస్ డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించి.. జ్యోతి ప్రజ్వలన చేయగా, చైతు, ఫోర్ న్యూ స్క్రాంబ్లర్ మోడల్స్‌ను (స్క్రాంబ్లర్ ఐకాన్, డెసర్ట్ స్లెడ్, ఫుల్ థ్రోటెల్, కేఫ్ రేసర్) లాంచ్ చేసాడు.
ఇద్దరూ బైక్స్‌ని సందర్శిస్తూ కాసేపు షోరూమ్‌లో సందడి చేసారు. నాగ చైతన్యకి స్పోర్ట్ బైక్స్, కార్స్ అంటే చాలా ఇష్టం.. తన దగ్గర లేటెస్ట్ బైక్ అండ్ కార్స్ కలెక్షన్ కూడా ఉంది.. ప్రస్తుతం వెకటేష్, నాగ చైతన్య కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నారు. షోరూమ్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన వెంకటేష్, నాగ చైతన్యలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.